Singer Sunitha: నా జీవితంలో ఇదే బెస్ట్ కాంప్లిమెంట్… సింగర్ సునీత ఎమోషనల్ కామెంట్స్!

0
41

Singer Sunitha: సింగర్ సునీత టాలీవుడ్ ఇండస్ట్రీలో గాయనిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి సునీత కుమారుడు ఆకాష్ త్వరలోనే సర్కారు నౌకరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.

ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సింగర్ సునీత వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను ఎన్నో పాటలు పాడాను ఎన్నో అవార్డులు అందుకున్నాను కానీ ఎప్పుడు కూడా నేను ఎమోషనల్ కాలేదు కానీ ఇక్కడ మాట్లాడుతుంటే చాలా ఉద్వేగానికి గురి అవుతున్నానని తెలిపారు.

ఒకరోజు రాఘవేందర్ రావు గారు మా అబ్బాయి గురించి నాతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.ఆకాష్ గురించి ఆయన మాట్లాడుతూ మీ అబ్బాయి మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తిత్వం నడవడిక ఉన్నటువంటి అబ్బాయి అని తన కుమారుడి గురించి ఎంతో గొప్పగా చెప్పారు.

Singer Sunitha: పిల్లల ఎదుగుదలలో కలిగే సంతోషం ఇదే…

ఇదే నా జీవితంలో ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటూ ఈమె ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.పిల్లలు ఎదుగుతుంటే తల్లిదండ్రులకు కలిగే సంతోషం ఇదేనేమో అంటూ ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు గారి నిర్మాణ సాధ్యంలో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్ ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకుంటుంది.