బైక్ మీద ఆరుగురు వచ్చారు.. వ్యాపారికి వార్నింగ్ ఇచ్చారు.. అంతలోనే?

ప్రస్తుత కాలంలో ఎవరి జీవితంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయో ఎవరికీ తెలియదు. ఉన్నఫలంగా ఎన్నో ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి ఈ సమయంలోనే మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా వహించిన లేదా కొద్దిగా ఏమరుపాటుగా ఉన్న తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి ఒక ప్రమాదకరమైన ఘటన రాజస్థాన్ లోని కోట జిల్లా మార్కెట్‌లో పట్టపగలే చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

పట్టపగలే మార్కెట్లోకి 2 బండ్లపై ఆరుగురు యువకులు వచ్చి మార్కెట్ లోని షాప్ యజమానులకు వేలుని చూపెడుతూ బెదిరించారు. అదే విధంగా మరో ముగ్గురు కైలాష్ మీనా అనే షాపు యజమాని ఇంట్లో ఉండగా అతని పేరు పెట్టి పిలిచిన వీరు ఆయన బయటికి రాగానే కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైన ఘటన చోటుచేసుకుంది.అయితే ఈ ప్రమాదంలో షాపు యజమానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

పండ్లు కూరగాయలు కమీషన్ ఏజెంటుగా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కైలాష్ మీనా ఇక్కడి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అతనిపై దాడి జరగడంతో పోలీసులకు సమాచారం తెలియజేశారు. ఈ క్రమంలోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడిని పలు విషయాలపై ఆరా తీశారు.

ఈ క్రమంలోనే కైలాష్ మీనా తనకు ఎవరు శత్రువులు లేరని,అలాంటిది దుండగులు ఈ విధంగా తనపై టార్గెట్ చేయడానికి కారణం ఏమిటో తనకు తెలియడం లేదని తెలియజేశారు. కానీ కైలాష్ మీనా అప్పుడప్పుడు మార్కెట్లో తోటి వ్యాపారుల పట్ల ఎంతో దురుసుగా ప్రవర్తించే వారిని వారిలో ఎవరైనా అతనిపై ఈ విధంగా దాడి చేయడానికి ఈ యువకులను ప్రోత్సహించి ఉంటారా అన్న నేపథ్యంలో విచారణ చేపట్టారు.

ఈ విధంగా కైలాష్ మీనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తామని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా ఉన్నఫలంగా మార్కెట్లో ఈ విధమైనటువంటి కాల్పులు జరగడంతో తోటి మార్కెట్ లోని వారందరూ తీవ్ర భయాందోళనలో ఉన్నారు.