” స్నేహా స్నేహ చిక్కుముడులు ఎన్నో చక్కగా దిద్దే వనిత..” ఈ పాట ఈ తరం వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు కానీ. 1990 సీరియల్స్ లో బాగా దగ్గరైన పాట ఇది. ఇప్పుడు అంటే సీరియల్స్ లలో మోస కథలతో సాగదీసే కథలతో నిమిషాల సీరియల్ని.. 10 నిమిషాల యాడ్స్ ఎంత సేపు ఉన్నా కూడా అత్త, కోడళ్ల గొడవలు, సాగదీసే సీరియల్ అంటేనే యావగింపు కలుగుతుంది. కానీ గతంలో సీరియల్స్ ఇలాగా లేవు ఇంట్లో కుటుంబ సభ్యులు అంతా కలిసి కూర్చొని చూసి ఆనందం పొందే వారు. అది కూడా ఒక్కో సీరియల్ ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ అందులో ఉండే పాత్రను కూడా డిఫరెంట్ గా ఉండేవి.

అంతే కాకుండా ఆ సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. చివరకి సీరియల్ పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. ఇకపోతే ప్రస్తుతం కొన్ని సీరియల్స్ లో క్వాలిటీ తగ్గింది కానీ ఒకప్పుడు ఈటీవీ సీరియల్స్ కు పెట్టింది పేరు అనే చెప్పాలి. ఆ సీరియల్స్ లో కూడా కొన్ని లేడీ డిటెక్టివ్ స్నేహ, అన్వేషిత తరంగాలు, ఎండమావులు ఇంకా మరికొన్ని సీరియల్ ఆ పాత్రలు ఆ పాత్రల్లో నటించిన వారు ఇప్పటికీ వాళ్లు మన కళ్ళముందే మెలుగుతూ ఉంటారు. ఇలాంటి వారిలో స్నేహ సీరియల్ లో నటించిన కావేరి. ఆవిడ మన ఇంట్లో ఆడపిల్లలాగా కనిపించేది. ఈ సీరియల్లో స్నేహగా నటించిన కావేరి స్పెషల్ డిటెక్టివ్ పాత్ర. ఆ తర్వాత కావేరీ మరికొన్ని తమిళ సీరియల్స్ లలో అక్క పాత్రలు చేసినప్పటికీ అంతగా క్రేజ్ దక్కించుకోలేదు. అదే సమయంలో ఒక తమిళ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమాతో హీరో ప్రశాంత్ కూడా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మరో 7 తమిళ సినిమాలో నటించడం జరిగింది.

ఇకపోతే మన తెలుగు ఇండస్ట్రీలో చిన్నారి ముద్దుల పాప, సాహసం అనే సినిమాలలో భానుచందర్, జగపతిబాబు సరసన లీడ్ పాత్ర పోషించింది. ఇక తన చివరి చిత్రం విజయ్ కాంత్ నటించిన సేతుపతి ఐపీఎస్ సినిమాలలో నటిస్తూనే సీరియల్ లో కూడా నటించింది. సినిమాలలో కంటే బుల్లి తెరపై ఎక్కువగా కాలం కనిపించిన కావేరి 15 సీరియళ్లలో నటించింది. మెట్టి వొలి అనే తమిళ సీరియల్ మన తెలుగులో ” మెట్టల సవ్వడి ” గా విడుదల అయ్యి తెలుగు, తమిళంలో మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ రాకేష్ అనే వ్యక్తిని 2013లో ప్రేమించి వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇంట్లో ప్రేమ వివాహానికి ఒప్పుకోక పోయేసరికి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె ఎలా ఉంది ఆమె కుటుంబం సభ్యుల అనేక ఫోటోలు నీకోసం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here