Sobhan Babu – Venkatesh : తెలుగు సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు. ఈయనంటే పడి చచ్చిపోయే అభిమానులున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈయనకు ఉన్నంతగా ఎవరికీ లేదు.. ఇకపై ఎవరికీ రాదు కూడా. అంతలా అతడి సినిమాలకు లేడీస్ టీవీలకు అతుక్కుపోతారు. ఫ్యామిలీకి సంబంధించి సినిమాలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకునేవారు.

చిన్నప్పటి నుంచి కూడా అతడికి సినిమాలంటే ఎంతో ఇష్టపడే వాడంట. తిరువూరులో కీలుగుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు తను బాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని, మల్లీశ్వరి సినిమాను 22 సార్లు చూశానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. అతడు ఏదైనా సినిమాకు కథ విని రిజెక్ట్ చేస్తే.. ఆ కథను ఏ హీరో తీసుకునేవాళ్లు కాదట.. అంత ధైర్యం కూడా ఎవరూ చేసేవాళ్లు కాదట.

అయితే ఓ కథను శోభన్ బాబు తిరస్కరిచిన తర్వాత.. మొదటి సారి విక్టరీ వెంకటేష్ దానిని ఓకే చేశారట. అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎంఎస్ రాజు ఈ కథను శోభన్ బాబుకు వివరించారు.. అంతే కాదు దీనికి తానే నిర్మాతగా వ్యవహరించాలని అనుకుంటున్నా అని చెప్పాడట.

కానీ అతడు ఒప్పుకోకపోవడంతో.. పాటు ఈ సినిమా తీసి మనిద్దరం శత్రువులు కావాలని తాను అనుకోవడం లేదని.. ఈ డబ్బులను ఏదైనా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టండి అంటూ సలహా ఇచ్చారట. కానీ ఇదే సినిమాను కోడి రామకృష్ణ దర్శకత్వం వహించి.. ఎంఎస్ రాజు నిర్మాతగా ‘శత్రువు’ సినిమా తీసి బంపర్ హిట్ కాట్టారు. ఇక ఎంఎస్ రాజు ఈ సినిమాతోనే స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు.