2000 దశకంలో తేజ అనే పేరు ఒక సంచలనం.ఆయన తీసిన ప్రేమ చిత్రాలు యువతను ఎంతగానో ఉర్రూతలూగించాయి. ఆ సినిమాలు లోని పాత్రలను నాటి యువత తమకు తాము ఓన్ చేసుకునేవారు. రామోజీరావు నిర్మాణ సారథ్యంలో 2001లో తెలుగు చిత్ర పరిశ్రమకు చిత్రం అనే సినిమాతో తేజ దర్శకుడిగా పరిచయమయ్యాడు ఆ సినిమా ఘన విజయం సాధించడంతో డైరెక్టర్ తేజ కు నిర్మాతల నుండి విపరీతంగా ఆఫర్లు రావడం జరిగింది. చిత్రం సినిమా తర్వాత తేజ తన రెండవ సినిమాగా ఫ్యామిలీ సర్కస్ తీశాడు. కానీ ఆ సినిమా అంతగా వర్కవుట్ కాలేదు. కానీ తేజకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.

తేజ మూడవ సినిమాగా ఏదైనా లవ్ స్టోరీ తీయాలనుకున్నాడు. ఆ క్రమంలో నిర్మాత కోరిక మేరకు వెంకటేష్ ను కలుద్దామని రామానాయుడు స్టూడియోకి వెళితే అక్కడ నువ్వు నాకు నచ్చావ్ సినిమా తో వెంకటేష్ బిజీగా ఉన్నాడు. తేజ ఇక చేసేది ఏమీ లేదని కారులో తిరిగి వస్తుండగా దారిలో.. ఒక గొర్రెల కాపరి గొర్లను తోలుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. అటు పక్కనే కారులో కూర్చున్న ఓ పెద్ధింటబ్బాయి గొర్రెలు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని హారన్ కొడుతున్న దృశ్యాన్ని తేజ తీక్షణంగా గమనించాడు. దీనిని ఆధారం చేసుకుని నువ్వు నేను అనే ఒక కథ రెడీ చేసుకున్నాడు.

తాను రాసిన ఈ ప్రేమ కథకు హీరో ఎవరైతే బాగుంటుందని.. ముందుగా సుమంత్ ను అనుకోగా తన డేట్స్ ఖాళీ లేకపోవడంతో తమిళ హీరో మాధవన్ కలువగా తెలుగు సినిమాలు చేయనన్నాడు. ఆ సమయంలో తన ఆఫీసుకు వచ్చిన ఉదయ్ కిరణ్ ని చూసి తన సినిమాకి అసలు ఉదయ్ కిరణ్ ని ఎందుకు హీరో కాకూడదు. అనే ఆలోచన వచ్చి వెంటనే ఉదయ్ కిరణ్ తో తన మనసులో మాట చెప్పాడు. హీరో ఉదయ్ కిరణ్ ఎగిరి గంతేసాడు. హీరోయిన్ కోసం ఆడిషన్స్ చేస్తే చివరికి ఓ ముంబాయి మోడల్ ను సెలెక్ట్ చేశారు. ఆమె స్పెషల్ ఫ్లైట్, టికెట్ అండ్ స్పెషల్ హోటల్ బుక్ చేయాలని కోరారు. దానితో విసుగొచ్చి డైరెక్టర్ తేజ అదే ఆడిషన్స్ లో లీస్ట్ గా వచ్చిన అమ్మాయిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు ఆమె పేరే అనిత.

షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నాక 2001 ఆగస్టు 10న దర్శక నిర్మాతలు నువ్వు నేను సినిమాని విడుదల చేశారు. అప్పుడే కాలేజీలు రీ ఓపెన్ అవడంతో యువత ఎగబడి చూసారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రేమ కథాంశంతో ఉండడం వలన ప్రేమజంటలు కాలేజీలకు బంకు కొట్టి సినిమాకు వెళ్లారు… గాజువాక పిల్ల మేం గాజులోల్లం కాదా అనే పాటతో బాగా ఇన్ స్పయిర్ అయిన ప్రేమికులు కాలేజీల నుండి లేచిపోయారని ఆ మధ్య కాలంలో ఓ టాక్ ఆంధ్ర రాష్ట్రమంతా చెక్కర్లు కొట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here