Tag Archives: 2022 year

Whatsapp Future Features: 2022లో వాట్సాప్ లో రానున్న కొత్త ఫీచర్లు ఇవే..అద్భుతంగా ఉన్నాయిగా..!

Whatsapp Features: వాట్సాప్ మెసేజ్ గురించి తెలియని వారు ఉండరు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ వాట్సాప్ గురించి తెలిసే ఉటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ.. యూజర్ కు అత్యంత సులువుగా ఆపరేట్ చేసేందుకు చేస్తోంది. అయితే 2022లో కూడా సరికొత్త ఫీచర్లతో ఈ వాట్సాప్ మన ముందుకు రాబోతోంది. వాటి గురించి తెలుసుకుందాం

Whatsapp Future Features: 2022లో వాట్సాప్ లో రానున్న కొత్త ఫీచర్లు ఇవే..అద్భుతంగా ఉన్నాయిగా..!

మొదటగా.. ఎవరైనా వాట్సాప్ ను పరిమినెంట్ గా తీసేయాలనుకుంటే కుదరదు. దానిలో కేవలం లాగ్ అవుట్ అనే ఆప్షన్ మాత్రమే కనపడునుంది. ఇక నుచి డిలీట్ మై అకౌంట్ అనే బటన్ కనపడకపోవచ్చు.
రీల్స్ అనేవి ఎక్కువగా ఇన్ స్టాగ్రామ్ లో చూస్తూ ఉన్నాం. ఇక నుంచి వాట్సాప్ లోనే డైరెక్ట్ గా రీల్స్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీనిని ప్రత్యేకంగా ఓ ప్రత్యేక సెక్షన్ లాగా తీసుకురానున్నారు.

Whatsapp Future Features: 2022లో వాట్సాప్ లో రానున్న కొత్త ఫీచర్లు ఇవే..అద్భుతంగా ఉన్నాయిగా..!

ఎవరైనా వాట్సాప్ చేసినప్పుడు ఇష్టం లేని సందర్భంలో వాటిని మనం ఆర్చీవ్ లో పెట్టేస్తాం. ఇక నుంచి దాని బుదలు ‘రీడ్ లేటర్’ అనే ఆప్షన్ ను తీసుకురానుంది. ఇన్సురెన్స్ లాంటి వాటిని కొనుగోలు చేసయాలంటే.. ప్రత్యేకంగా వేరే వెబ్ సైట్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లో నే ఆ సౌకర్యాన్ని కల్పించనున్నారు. దీనిలో హెల్త్ తో పాటు.. పెన్షన్ స్కీమ్ లకు సంబంధించి వాటిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

యూజర్ల భద్రత కోసం వాట్సాప్ మరో అడుగు ముందుకేసింది. చాట్ మెసేజ్ లే కాకుండా.. ఇక నుంచి ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ను కాల్స్, స్టేటస్ సెక్షన్లకు కూడా తీసుకురానున్నారు. కాంటాక్ట్స్ కార్డును మరింత అందంగా తీసుకురానున్నారు. లాస్ట్ సీన్ కు ఇక ముందు ఎక్కువ ఆప్షన్ తీసుకురానున్నారు. ఏ కాంటాక్ట్ అయినా.. మనం అనుమతి ఇస్తేనే చూసే విధంగా తీసుకురానున్నారు.


ఇంకా ఎన్నో రకాలు సౌకర్యాలు..

డిలీట్ చేసే సమయాన్ని పొడిగించనున్నారు. ఏదైనా మెసేజ్ ను తప్పుగా పంపినప్పుడు ఆవతలి వాళ్లు చూడకముందే.. డిలీట్ చేసేయాలి. లేదంటే.. డిలీట్ చేసినా ఉపయోగం ఉండదు. ఇప్పుడు అలా లేకుండా.. సమయాన్ని పొడిగించనున్నారు. ఇక గ్రూప్ లో ఎవరైనా అసభ్యకర పోస్టులు, వీడియోలు పెడితే.. ఎవరైతే దానిని పోస్టు చేశారో అతడే డిలీట్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా ఉండదు.. ఆ అధికారం గ్రూప్ అడ్మిన్లకు కూడా కల్పించనున్నారు. ఇంకా బిజినెస్ కు సంబంధించిన.. మరికొన్ని స్టిక్కర్లు లాంటి ఆప్షన్లు తీసుకురానున్నారు.