Tag Archives: 31 degrees in 8 years

జైలుశిక్ష అనుభవిస్తూ 31 డిగ్రీలు పూర్తి చేసిన ఖైదీ.. చివరకు…?

సాధారణంగా ఏదో ఒక కేసులో అరెస్ట్ అయిన ఖైదీలు ఏం చేస్తారనే ప్రశ్న ఎదురైతే వాళ్లు నిరాశానిస్పృహలతో జీవనం సాగిస్తూ ఉంటారని.. వీలైనంత తక్కువ సమయంలో శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటారని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ఆ ఖైదీ మాత్రం భిన్నం. 8 ఏళ్ల జైలు శిక్షాకాలంలో ఆ ఖైదీ ఏకంగా పదుల సంఖ్యలో డిగ్రీలను సాధించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఖైదీ గురించి తెగ వైరల్ అవుతోంది. జైలు నుంచి విడుదలైన తరువాత ఉద్యోగంలో చేరి మరిన్ని డిగ్రీలను పూర్తి చేసి గుజరాత్ కు చెందిన ఆ ఖైదీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్ని డిగ్రీలు సాధించిన ఆ ఖైదీ పేరు భానూభాయీ పటేల్. ఏకంగా 32 డిగ్రీలు సాధించిన ఈ ఖైదీ వరల్డ్ రికార్డ్ ఇండియా, యూనివర్సల్ రికార్డ్ ఫోరం, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లలో తన పేరు నమోదు చేసుకున్నాడు.

ఒక డిగ్రీ పూర్తి చేయడానికే చాలామంది నానా తంటాలు పడుతున్న ఈరోజుల్లో ఏకంగా 32 డిగ్రీలు పూర్తి చేసిన ఆ వ్యక్తి గురించి తెలిసి అవాక్కవ్వడం నెటిజన్ల వంతవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే భావ్ నగర్ లోని మహువాకు చెందిన భానూభాయీ పటేల్ ఎంబీబీఎస్ చదివి అమెరికాకు వెళ్లాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు స్టూడెంట్ వీసాతో ఉద్యోగం చేస్తూ భానూభాయ్ అకౌంట్ కు నగదును పంపాడు.

దీంతో ఫారిన్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో అతనికి జైలుశిక్ష విధించారు. అతని డిగ్రీలను చూసి అంబేద్కర్ యూనివర్సిటీ జాబ్ ఇచ్చింది. ఉద్యోగంలో చేరాక కూడా భానూ డిగ్రీలు సాధించేందుకు ప్రయత్నం ఆపలేదు. భానూభాయ్ హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ భాషల్లో పుస్తకాలు కూడా రాశారు.