Tag Archives: aeroplane in clouds

Aeroplane: విమానం మబ్బుల్లో ఎలా ముందుకు వెళ్తుంది..! కారణం ఏమిటో తెలుసా?

Aeroplane: చాలా మందికి విమానాలు ఎలా పనిచేస్తాయనే డౌట్.. వాటి దారి ఎలా తెలుస్తుందని, ఎలా గమ్యస్థానాలకు చేరుకుంటాయనే సందేహాలు వస్తుంటాయి. భూమిపై అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా విమానాలు తమ గమ్యస్థానాలకు చేరుతుంటాయి.

భూమిపైన ఉన్న ప్రతీ విమానాశ్రయం కోఆర్డినేట్స్ ఫ్లైట్ కంప్యూటర్ లో నిక్షిప్తం అయి ఉంటాయి. డెస్టినేషన్ మ్యాప్ తో ఫైలెట్ వెళ్లి తను వెళ్లాల్సిన ప్రాంతం యెక్క డెస్టినేషన్ కోడ్ ఎంటర్ చేసి హెచ్ఎస్ఐ సాయంతో అక్కడికి చేరకుంటాడు.

కెప్టెన్ తన కంప్యూటర్ లో డెస్టినేషన్ డేటా పూరించడంతో రెండు త్రిభుజాలు ఏర్పడుతాయి. ఆ తర్వాత గమ్యస్థానం ఎక్కడుందో కంప్యూటర్లు నమోదు చేస్తారు.ఇలా కంప్యూటర్లు విమానం వెళ్లాల్సిన మార్గాన్ని నిర్థేశించుకుంటుంది. ఈ మార్గాలు అంతర్జాతీయ నిబంధనల ప్రకారం తయారవుతాయి.

ఫైలెట్లు సంప్రదింపులు జరుపుతూ..


పర్వతాలు, సముద్రమార్గాలు, గాలులు, వాతావరణం ఇతర దేశాల సరిహద్దులను దృష్టిలో ఉంచుకుని విమానం ఎగరడానికి మార్గాలను రూపొందిస్తారు.  ఇదిలా ఉంటే ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల విమానాలకు దిశా నిర్థేశం చేయడానికి కీలకంగా ఉంటాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ).. విమానం ఎత్తు, వెళ్లాల్సిన మార్గం గురించి ఎప్పటికప్పుడు ఫైలెట్లు సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. విమానం వెళ్తున్న మార్గాన్ని బట్టి ఆయా ప్రదేశాల్లో ఉండే ఏటీసీలు విమానాలకు ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటారు. విమానం వెళ్లే మార్గంలో ఇతర విమానాలు కూడా ప్రయాణిస్తుంటాయి. దీంతో ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదాలు కూడా ఉంటాయి. దీంతో ఏటీసీ ఎప్పటికప్పుడు.. కీలక ఆదేశాలు ఇస్తూ ఉంటుంది.