Tag Archives: Australian man

సార్.. బయట బతకలేను.. నన్ను జైలుకు తీసుకెళ్లండి.. అంటూ ఓ వ్యక్తి..

ఒక్కో సమయంలో సమాజంలో బతకడం కంటే జైలు జీవితం గడపడం బెటర్ అంటూ కొందరు అంటుంటారు. వాళ్లు ఆ మాట అన్నారంటనే అర్థం అవుతుంది.. ఎంత కష్టం వస్తే వాళ్లు ఆ స్టేజికి వచ్చి అంటారో. ఇలా ఓ వ్యక్తికి కొన్ని సంవత్సరాల క్రితం జైలు శిక్ష పడింది. అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వెళ్లాడు. దాదాపు 30 ఏళ్లు బతికాడు.

తర్వాత ప్రస్తుత పరిస్థితులను భరించలేక మళ్లీ ఆ శిక్షను అమలు చేయాలని వెళ్లి మళ్లీ లొంగిపోయాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని డార్కో డౌగీ డెసిక్ అనే వ్యక్తి గంజాయి పెంచాడన్ననెపంతో పోలీసులు అరెస్టు చేసి.. మూడున్నర ఏళ్ల పాటు ఆయనకు జైలు శిక్ష విధించారు. 1992లో న్యూసౌత్ వేల్స్ లో ఉన్న జైలులో జైలు శిక్ష అనుభవించాడు. అలా 13 నెలలు జైలులో బాగానే గడిపాడు. తర్వాత అతడికి విసుగు పుట్టి ఎలాగైనా అక్కడ నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా.. జైలు గదిలోనే సొరంగం తవ్వుకొని బయటపడ్డాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలించని ప్రదేశం లేదు.

ఎంత వెతికినా అతడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు ఆశలు వదులుకున్నారు. తర్వాత అతడు ఆ రోజు నుంచి.. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. కానీ అతడు గత కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులకు గురయ్యాడు. బయట జీవితం కంటే జైలు జీవితమే బెటర్ అని వెళ్లి పోలీసులకు చెప్పాడు. ఇది విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంత విరక్తి పుట్టడానికి గల కారణం ఏంటో తెలుసా.. కరోనా మహమ్మారి.

దీని వల్ల ఉన్న ఉపాధి పోయి.. ఉండటానికి ఇల్లు లేక.. తినడానికి తిండి లేక దుర్భర జీవితాన్ని గడిపినట్లు చెప్పాడు. దీంతో అతడి విజ్ఞప్తిని స్వీకరించిన పోలీసులు జైలు నుంచి పారిపోయినందుకు 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు అంతకు ముందు మిగిలిన మరో సంవత్సరం జైలు శిక్షతో కలిపి మొత్తం 8 ఏళ్లు ఉండాల్సి వచ్చింది. డార్కో మంచి వాడని..తమతో మంచిగా కలిసిమెలిసి ఉండేవాడని.. మంచి వర్కర్ అంటూ కొంతమంది స్థానికులు వచ్చి పోలీసులను విన్నవించారు. అతడిని విడిపించండి.. మేము అతడిని పోషిస్తాం అంటూ చెప్పడం విశేషం.