Tag Archives: bank accout

Bank Accounts: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..! వాటిపై పెరిగిన వడ్డీ రేట్లు..!

Bank Accounts: ఇటీవల ఇండియాలో బ్యాంకింగ్ సేవలు బాగా విస్తరించాయి. సులభతరంగా లోన్లు కూడా ఇస్తున్నారు. దీంతో పాటు ఇన్స్ స్టంట్ లోన్లను అందిస్తున్నారు. ఉద్యోగులు సొంతిళ్లు, కారు, బైక్ ఇంకేదైనా.. కొనుక్కొవాలంటే వెంటనే లోన్లను ప్రొవైడ్ చేస్తున్నారు.

Bank Accounts: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..! వాటిపై పెరిగిన వడ్డీ రేట్లు..!

ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు తన ఖాతాదారులకు అనేెక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇటు బిజినెస్ చేయడానికి కూడా బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి.  భారతదేశంలో టాప్ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు. 

Bank Accounts: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..! వాటిపై పెరిగిన వడ్డీ రేట్లు..!

తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు హెడ్ డీ ఎఫ్ సీ కూడా తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటును సవరించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 2, 2022 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకు తన వైబ్ సైట్ లో పేర్కొంది. 

ఈ సేవింగ్స్ ఖాతాలకు వర్తిస్తాయని..

నోటిఫికేషన్ ప్రకారం బ్యాంకులో డిపాజిట్ మొత్తాల ఆధారంగా వడ్డీ రేట్లను ప్రకటించింది. రూ. 50 లక్షల కన్నా తక్కువ ఉన్న నిల్వ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై సంవత్సరానికి 3 శాతం వడ్డీ రేట్లను ఇస్తోంది. రూ. 50 లక్షలకు పైగా రూ. 1000 కోట్ల కన్నాా తక్కువగా ఉన్న నగదు డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీని ఏడాదికి ఇవ్వనుంది. దీంతో పాటు రూ. 1000 కోట్ల కన్నా ఎక్కువ పొదుపు నిల్వలపై ఏడాదికి 4.50 శాతం వడ్డీరేటును అందిస్తోంది. ప్రస్తుతం సవరించిన రేట్లు దేశీయ, ఎన్ ఆర్ ఓ, ఎన్ ఆర్ ఈ సేవింగ్స్ ఖాతాలకు వర్తిస్తాయని బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.