Tag Archives: Bank Of Maharashtra recruitment 2021

నిరుద్యోగులకు శుభవార్త.. ఆ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..

ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది ఒక స్వప్నం లాంటిది. దానిని సాకారం చేసుకోవాలంటే.. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. దాని కోసం వివిధ నగరాలు, పట్టణాల్లో కోచింగ్ కూడా తీసుకుంటారు. ఇక బ్యాంక్ ఉద్యోగాలు అయితే కచ్చితంగా కోచింగ్ కు తీసుకోవాల్సిందే. వారి కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక శుభవార్తను తీసుకొచ్చింది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయింది. ఈ నెల 19 వరకు చివరితేదీగా ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం పోస్టులు 190 ఉన్నట్లుగా తెలిపారు. ఇందులో విభాగాల వారీగా చూస్తే.. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, లా ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్, ఐటీ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్, విండోస్ అడ్మినిస్టేటర్, ప్రొడక్ట్ సపోర్ట్ ఇజనీర్, నెట్ వర్క్ ఆండ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్,
ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

వీటికి ఆయా పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ లేదా బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలని పేర్కొన్నారు. వీటికి 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలన్నారు. ఆన్ లైన్ లో నిర్వహించే పరీక్షలో 60 నిమిషాల వ్యవధిలో 100 ప్రశ్నలు ఉంటాయని.. వీటికి నెగెటివ్ మార్కులు లేదని పేర్కొన్నారు.