Tag Archives: booking

గ్యాస్ సిలిండర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. రూ.50 క్యాష్ బ్యాక్..?

దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలకు పైగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై అదనపు భారం పడుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో డెలివరీ బాయ్స్ గ్యాస్ సిలిండర్ వినియోగదారుల నుంచి తీసుకోవాల్సిన మొత్తం కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. ఫలితంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు నష్టపోతున్నారు.
అయితే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ పాకెట్స్ వాలెట్ ద్వారా 50 రూపాయల క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ తక్కువ మొత్తమే అయినా పెరిగిన రేట్ల దృష్ట్యా ఈ ఆఫర్ ను వినియోగించుకుంటే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా జనవరి నెల 25వ తేదీలోపు గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఈ ఆఫర్ ను పొందాలనుకునే గ్యాస్ సిలిండర్ వినియోగదారులు మొదట పాకెట్స్ వాలెట్ యాప్ ను మొబైల్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. pmrjan2021 అనే ప్రోమో కోడ్ ను ఉపయోగించడం ద్వారా ఈ ఆఫర్ ను పొందవచ్చు. పాకెట్స్ వాలెట్ యాప్ లో పే బిల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బిల్లర్ అనే ఆప్షన్ ను ఎంచుకుని కన్సూమర్ ఐడీ లేదా మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి సిలిండర్ ను బుకింగ్ చేసుకోవచ్చు.

గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకున్న 10 రోజుల్లో క్యాష్ బ్యాక్ అమౌంట్ యాప్ వాలెట్ లో జమవుతుంది. తక్కువ రోజులే సమయం ఉండటంతో ఈ నెలలో గ్యాస్ సిలిండర్ అవసరం ఉన్నవాళ్లు ఈ ఆఫర్ ను వినియోగించుకుని సులభంగా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవచ్చు.

కారు కొనాలనుకునే వాళ్లకు శుభవార్త.. రూ.11,000 చెల్లిస్తే కొత్త కారు..?

ఈ మధ్య కాలంలో కంపెనీలు వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే పండగ రోజుల్లో అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా నిస్సాన్ కంపెనీ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరకే కొత్త కారును బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. నిస్సాన్ కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల పండగ సమయంలో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరనుంది.

నిస్సాన్ కంపెనీ మరికొన్ని రోజుల్లో మార్కెట్ లోకి రాబోయే కొత్త మ్యాగ్నైట్ కారు ధరలను ప్రకటించడానికి సిద్ధమవుతోంది. మ్యాగ్నైట్ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే వెల్లడి కాగా డీలర్లు ఇప్పటికే అనధికారికంగా మ్యాగ్నైట్ కారు బుకింగ్ లను స్వీకరిస్తున్నారని తెలుస్తోంది. కంపెనీ అతిత్వరలో అధికారికంగా కారు బుకింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనుంది. ఎవరైనా కారు కొనుగోలు చేయాలని భావిస్తే 11,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు చెల్లించి కారును బుకింగ్ చేసుకోవచ్చు.

కారును బుకింగ్ చేసుకోవడం కొరకు సమీపంలోని డీలర్లను సంప్రదించాల్సి ఉంటుంది. నిస్సాన్ మ్యాగ్నేట్ కారు డెలివరీలు వచ్చే నెల నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ కారు 1.0 లీటర్ ఇంజిన్ తో మార్కెట్ లోకి వస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం 5.5 లక్షల రూపాయల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతీ సుజుకీ వితారా బ్రెజా, మహీంద్రా ఎక్స్‌యూవీ300, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సన్, కియా సొనేట్ లాంటి కార్లకు నిస్సాన్ కార్లు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. తక్కువ ధరకే బుకింగ్ చేసుకునే అవకాశం ఉండటంతో కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశం ఉంది.