Tag Archives: bumper offer

అదృష్టం అంటే ఇదే..! భారీ ఆఫర్ కొట్టేసిన బుల్లెట్ బండి వధువు!

బుల్లెట్టు బండి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం ఓ పెళ్లి కార్యక్రమంలో భాగంగా బుల్లెట్ బండి పాటకు వేసిన డాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారి విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఏ ఫంక్షన్లో చూసిన ఈ పాట మార్మోగిపోతోంది.నిజానికి ఈ పాట ఎప్పుడో విడుదల అయినప్పటికీ అప్పటి నుంచి రాని గుర్తింపు ఈ పెళ్లిలో వధువు వేసిన స్టెప్పులతో బాగా పాపులారిటీని దక్కించుకుంది.

ఈ విధంగా పెళ్లిలో ఈ పాటకు డాన్స్ వేసిన నూతన వధూవరులకు అద్భుతమైన అవకాశం దక్కిందని చెప్పవచ్చు.ఈ డాన్స్ వీడియోకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రావడంతో ఈ జంట ఒక్కసారిగా సెలబ్రిటీలగా మారిపోయారు. ఈ క్రమంలోనే బుల్లెట్టు బండి పాట నిర్మించిన సంస్థ తమ తదుపరి పాటకు డాన్స్ చేసే అవకాశాన్ని సదరు యువతి కల్పించినట్లు తెలుస్తోంది.

బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు ఈ పాటను రూపొందించారు. ఈ క్రమంలోనే ఈ సమస్త వారు నిర్మించే తదుపరి పాటలకు డాన్స్ చేయాలని అవకాశం వీరికి కల్పించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సదరు సంస్థ ఈ జంటకు ఫోన్ చేయడంతో అందుకు ఆమె అంగీకరించిన తెలుస్తోంది. ఈ విధంగా ఊహించని రీతిలో తనకు ఇలాంటి అవకాశం రావడంతో ఆ జంట ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధంగా ఈ పాట ద్వారా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయిన ఈ వధువుకు ఆ తరువాత అదే సంస్థలో మరి కొన్ని పాటలకు డాన్స్ చేసే అవకాశం రావడంతో ఈమె నిజంగానే అదృష్టవంతురాలు అంటూ పలువురు కామెంట్లు కురిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అదృష్టం కలిసి వచ్చి రాత్రికిరాత్రే సెలబ్రెటీలుగా గుర్తింపు తెచ్చుకున్న ఎంతో మందిలో ఈ బుల్లెట్ బండి దంపతులు ఒకరి అని చెప్పవచ్చు.

ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. సులభంగా కొత్త ఇల్లు..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వినియోగదారులకు గత కొన్నిరోజులుగా వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రజల ఆదాయం భారీగా తగ్గిన నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గిస్తూ ఎస్బీఐ బ్రహ్మాండమైన ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఎస్బీఐ కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకునేవారికి బ్రహ్మాండమైన ఆఫర్లను ప్రకటించింది.

గృహ రుణాల వడ్డీ రేటుపై ఏకంగా 25 బేసిక్ పాయింట్ల రాయితీని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఎవరైతే ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారో వారికి ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. అయితే ఎస్బీఐ రుణం తీసుకున్న వారి సిబిల్ స్కోరును సైతం పరిశీలిస్తోంది. అయితే 75 లక్షల రూపాయలకు పైగా హోం లోన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ బేస్ రేటు వర్తింపు జరుగుతుంది.

గతంలో మధ్య తరగతి వర్గాల ప్రజలకు సైతం ప్రయోజనం చేకూరేలా పది నుంచి 20 బేసిక్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ ప్రకటించిన ప్రధాన నగరాలతో పాటు మెట్రో నగరాల్లో ఈ రాయితీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను వెల్లడించింది. ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వినియోగదారులు ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 లక్షల రూపాయలకు పైగా 7 శాతం వడ్డీని.. 30 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే 6.9 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ వినియోగదారులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుండటం గమనార్హం.

విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు లక్ష రూపాయలు అందిస్తున్న ఎస్బీఐ!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేశంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారి నుంచి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెల్లోషిప్ కొరకు ఎస్బీఐ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఎవరైతే రీసెర్చ్ ఫెల్లోషిప్ కు ఎంపికవుతారో వారికి నెలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఎస్బీఐ స్టైఫండ్ రూపంలో అందించే ఈ మొత్తం పొందాలంటే ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఎస్బీఐ ఫెల్లోషిప్ కు ఎంపికైన అభ్యర్థుల యొక్క పనితీరును ఫెల్లోషిప్ చివరలో పరిశీలించి అద్భుతమైన పనితీరును ప్రదర్శించిన వారికి 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు స్టైఫండ్ కు అదనంగా చెల్లించనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఎస్బీఐ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎస్బీఐ కల్పిస్తోంది. సెప్టెంబర్ నెల 18వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 8వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది.

పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేయడానికి మరో 48 గంటల సమయం మాత్రమే ఉంది. https://www.sbi.co.in/careers లేదా https://bank.sbi/careers వెబ్ సైట్ల ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 5 మందికి మాత్రమే ఫెల్లోషిప్ అందించనుంది. 2020 జూలై 31 నాటికి 40 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ ఉన్నవాళ్లు ఈ ఫెల్లోషిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫెల్లోషిప్ లో జాయిన్ అయిన రోజు నుంచి 24 నెలల పాటు కాంట్రాక్ట్ ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారు ఎంపికైతే వారి ఈ మెయిల్ కు కాల్ లెటర్ వస్తుంది. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా 5 మందిని ఎంపిక చేస్తారు. ఐటీ లేదా ఎకనమిక్స్‌ లేదా బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ లో పీహెచ్డీ చేసిన వాళ్లు ఫెల్లోషిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వాళ్లకు టీచింగ్ లేదా రీసెర్చ్‌ వర్క్ కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. జర్నల్స్ రాసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.