Tag Archives: cheating

బట్టతల విషయాన్నీ దాచి పెళ్లి చేసుకున్నాడు… భార్య ఊహించని శిక్ష?

సాధారణంగా ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూసి పెళ్ళి నిశ్చయించుకుంటారు. అలాగే అబ్బాయిల విషయంలో అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అతని గురించి విచారణ చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు వారి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. అలా పెళ్లి చేసుకున్న ఓ జంట పెళ్లి చూపులప్పుడు పెళ్ళికొడుకు తనకు బట్టతల ఉందన్న విషయం దాచి పెళ్లి చేసుకోవడం వల్ల అతనిపై పరువునష్టం కేసు వేయడం తాజాగా ముంబై నగరంలో చోటు చేసుకుంది.

ముంబై నగరంలోని మీరా రోడ్లో నివాసముండే 29 ఏళ్ల వ్యక్తి నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ వ్యక్తి గత నెల క్రితం చార్టెడ్ అకౌంట్ గా ఉద్యోగం చేసే 27ఏళ్ల మహిళతో వివాహం జరిపించారు. ఆ వ్యక్తికి బట్టతల ఉండడంతో గత కొద్ది సంవత్సరాల నుంచి విగ్గును పెట్టుకొని మేనేజ్ చేస్తూ వచ్చాడు. అదేవిధంగా తన పెళ్లి చూపులప్పుడు కూడా తనకు బట్టతల ఉన్న విషయం అమ్మాయి వారితో చెప్పకుండా వివాహం జరిపించారు. వివాహమైన కొద్ది రోజులకు అసలు విషయం బయటపడడంతో తన భార్య మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని ఆరోపించింది.

అబ్బాయిలకు బట్టతల ఉండడం సర్వసాధారణమేనని అబ్బాయి తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఆమె వినకుండా, నయా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్న భర్త పై తగిన చర్యలు తీసుకోవాలని, అతడికి సహకరించిన తన తల్లిదండ్రుల పై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బట్టతల ఉందన్న విషయం ముందుగా తెలిసి ఉంటే పెళ్ళికి అంగీకరించేది కాదని బాధిత మహిళ పోలీసుల దగ్గర తన గోడును వెల్లడించింది. మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నందుకు గాను పరువు నష్టం కింద తన భర్త, అత్త,మామల పై కేసు నమోదు చేశారు.

పది వేలు కడితే ఇరవై వేల రూపాయలు.. ఎక్కడంటే..?

ఈ మధ్య కాలంలో మోసాలు చేయడానికి మోసగాళ్లు ఎక్కువగా ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. డబ్బును ఆశ చూపి అమాయక ప్రజలను ఈ నిలువునా ముంచేస్తున్నారు. మాటలతో గారడీ చేస్తూ కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. స్కీముల పేరుతో కొత్త తరహా స్కాములకు తెరలేపుతున్నారు. లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా కోట్ల రూపాయలు వసూలు చేస్తూ అమాయకపు ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు.

ఏపీలో నెల్లూరు జిల్లాలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ ట్రేడింగ్ ద్వారా 84 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన కొందరు యువకులు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వెల్‌ పే ట్రేడర్స్‌ పేరుతో సంస్థను ప్రారంభించారు.

ప్రజలకు 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 100 పనిదినాల్లో రోజుకు 200 రూపాయల చొప్పున ఆన్ లైన్ లో 20,000 రూపాయలు జమ చేస్తామని ప్రకటనలు ఇచ్చారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో చాలామంది తమ కష్టార్జితాన్ని డిపాజిట్ చేశారు. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా ఏపీకి చెందిన 12,600 మంది ఈ మోసానికి బలయ్యారు. అలా మోసపోయిన వారిలో కొందరు బాధితులు నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరమ్మ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకోవడం కోసం అధికారులు ప్రత్యేక బృందాలను నియమించాయి. ఈ బృందాలు కేసులో ప్రధాన నిందితులైన రవికుమార్, శ్రీను, సుమన్ లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మనీ స్కీంల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.