Tag Archives: cheif justice

పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళ.. త్వరలో బాధ్యతల స్వీకరణ..

దేశంలో అత్యున్నతమైన న్యాయ స్థానం అంటే మనం సుప్రీంకోర్టుగా చెబుతాం. అయితే మన దాయాది దేశం అయిన పాకిస్థాన్ కు కూడా అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు ఉంది. అయితే అక్కడ మొట్టమొదటి సారి ప్రధాన న్యాయమూర్తిగా ఓ మహిళ ఎంపిక కానున్నారు. ఆగస్టు 17 న ప్రస్తుతం చీఫ్ జస్టిస్‌గా ఉన్న ముషీర్ ఆలం పదవీ విరమణ చేయనున్నారు. తర్వాత చీఫ్ జస్టిస్‌ ఎవరుండాలనే నిర్ణయం అతడిపైనే ఉంటుంది.

తర్వాత చీఫ్ జస్టిస్‌గా ఓ మహిళ పేరును ప్రస్తావించారు. ఆమె పేరు అయేషా మాలిక్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పాకిస్థాన్ కు మహిళ బాధ్యతలు స్వీకరించడం అనేది మొదటిసారి. జస్టిస్ ఆలమ్ సిఫారసు మేరకు న్యాయ కమిటీ ఆయేషా మాలిక్‌ను అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నియమించనుంది. 1997లో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన ఆమె.. 2001లో ఆమె కరాచీలోని తన న్యాయసేవా సంస్థలో పని చేశారు.

లాహోర్‌లో ఉన్న పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా విద్యాసంస్థ నుంచి ఆమె న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. ఆ తర్వాత ఆమె మాస్టర్స్ కోసం లండన్ వెళ్లారు. అక్కడ హార్వర్డ్ లా స్కూల్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. తర్వాత 2012 నుంచి ఇప్పటి వరకు లాహోర్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. సీనియారిటీ జాబితాలో ఆమె నాలుగో స్థానంలో ఉంది. 2019లో లాహోర్‌లోని మహిళా న్యాయమూర్తుల రక్షణ కమిటీకి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు.

2019లోనే ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. పురుష న్యాయవాదుల పోకిరి పనులకు వ్యతిరేకంగా ఆమె ఈ ప్యానెల్ ను ఏర్పాటు చేశారు. మహిళల కన్యత్వ పరీక్షలపై ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో జస్టిస్ అయేషా జనవరిల నెలలో వార్తల్లో నిలిచారు. అంతే కాకుండా ఆమెకు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ జడ్జీస్ లో కూడా సభ్యత్వం ఉంది.