Tag Archives: china floods 2021

నదులను తలపిస్తున్న చైనా రోడ్లు.. వరదల్లో చిక్కుకున్న నగరాలు!

చైనా దేశం గత కొన్ని సంవత్సరాలలో ఎప్పుడు చూడని వర్షాన్ని ఈ ఏడాది చూస్తోంది. ఈ ఏడాది భారీగా కురిసిన వర్షాల కారణంగా చైనాలోని పలు నగరాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. అదేవిధంగా రోడ్లు, రైల్వే స్టేషన్లు నదులను తలపిస్తున్నాయి. అధిక వర్షపాతం నమోదు కావడం వల్ల పెద్ద ఎత్తున రోడ్లపైకి నీరు చేరుకోవడంతో పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఇప్పటివరకు ఈ వరద ఉధృతిలో సుమారు 12 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

చైనాలోని హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగ్ఝౌలో సుమారు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాత్రికి రాత్రి భారీ వర్షాలు కురవడం చేత నైట్ షిఫ్ట్ ఉద్యోగాలకు వెళ్ళినవారు, ఆఫీసులోనే ఇరుక్కుపోయారు.ఈ క్రమంలోనే వరద ముప్పు ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రస్తుతం చైనా దేశంలో సుమారు 10 నగరాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం హెనాన్ ప్రావిన్స్ లో అధిక వర్షపాతం నమోదు కావడమే కాకుండా ఈ ప్రాంతం వారికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు. ఈ ప్రాంతానికి అతి దగ్గరలోనే డ్యామ్ ఉందని ప్రస్తుతం వర్షాల కారణంగా అది పూర్తిగా దెబ్బతింది. ఒకవేళ వర్షాలు తెరపి లేకుండా పడితే డ్యామ్ దెబ్బతిని కూలిపోతే నగరం మొత్తం జలప్రళయంలో కూరుకు పోతుంది.

ప్రస్తుతం ఈ ప్రాంతంలోని ప్రజలు వర్షం ధాటికి ప్రజలు లు పడుతున్న ఇబ్బందులకు,వర్షం కారణంగా వరద నీటిలో కొట్టుకు పోతున్న కార్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగా హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగ్ఝౌ ప్రాంతంలో ఏడాది మొత్తం వర్షం కురుస్తూనే ఉంటుంది. అయితే గత మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.