Tag Archives: chinna jeeyar

Chinna Jeeyar: సమ్మక్క సారక్క దేవతల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్… ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజన నేతలు!

Chinna Jeeyar: ఆధ్యాత్మిక గురువుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న చిన్న జీయర్ స్వామి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ గిరిజనులు ఎంతో పవిత్రంగా భావించే సమ్మక్క సారక్క వనదేవతల పై చిన్న జీయర్ స్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇలా ఈయన సమ్మక్క సారక్క గురించి ఇలా మాట్లాడటంతో ఒక్కసారిగా తెలంగాణ గిరిజన నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

Chinna Jeeyar: సమ్మక్క సారక్క దేవతల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్… ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజన నేతలు!

ఈ సందర్భంగా చిన జీయర్ వనదేవతల గురించి మాట్లాడుతూ వాళ్లేం దేవతలా..? బ్రహ్మలోకం నుంచి దిగివచ్చినవాళ్లా..? ఏమిటి చరిత్ర..? ఏదో ఒక అడవి దేవత. గ్రామ దేవత. ఈ గ్రామదేవతను అక్కడున్న వాళ్ళు పూజించుకోడంలో తప్పులేదు కానీ విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు అక్కడ వ్యాపారం పెట్టేశారు. చాలా అన్యాయం జరుగుతోంది అంటూ మేడారం సమ్మక్క సారక్కలపై చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Chinna Jeeyar: సమ్మక్క సారక్క దేవతల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్… ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజన నేతలు!

అయితే ఆయన ఇప్పుడు మాట్లాడిన వ్యాఖ్యలు కావు గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమ్మక్క సారక్క భక్తులు చిన్న జీయర్ స్వామి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారక్కల గురించి ఇలా మాట్లాడటంతో ఎమ్మెల్యే సీతక్క చిన్నజీయర్ స్వామి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి….

వనదేవతగా భావిస్తున్న మాతల్లులది వ్యాపారమా?మా తల్లిని దర్శించుకోవడానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేకుండా ఉచితంగా దర్శనం చేసుకోవచ్చు. కానీ మీరు బంగారంతో తయారు చేయించిన సమతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకోవాలంటే 150 రూపాయలు టికెట్టు పెట్టి దర్శించుకోవాలి. ఇలా తెలంగాణ గిరిజనులు ఎంతో పవిత్రంగా భావించే సమ్మక్క సారక్కల గురించి ఇలా మాట్లాడటం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చినజీయర్ స్వామి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.