Tag Archives: closed

ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో మాల్స్, థియేటర్స్ బంద్..!

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ప్రతీ రోజూ పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని.. మునుపటి వేవ్ కంటే.. ఈ సారి వచ్చే వేవ్ ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించింది.

దీంతో కొన్ని దేశాలు ఇప్పటికే విదేశీ ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించడం లేదు. ఇక మన భారతదేశలో కూడా కేసులు తగ్గి, సాధారణ జనజీవనం మొదలైన కొద్దినెలల్లోనే ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ రూపంలో కలవరపెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరగవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి.. అన్నిరంగాలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, వైరస్‌పై భయం తగ్గడంతో జనం మాస్కులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలను పక్కనపెట్టారు.

అయితే దీనిపై రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ కొత్త వేరియంట్ వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ఎయిర్ పోర్టు వద్ద విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అవసరమనుకుంటే వారిని క్వారంటైన్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త వేరియంట్ మూలంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు కేంద్రాలకు నిన్నటి నుంచి పరుగెడుతున్నారు. ప్రజల్లో భయం మళ్లీ మొదలైందనే చెప్పాలి. ఇక మంత్రిమండలి సమావేశం మాల్స్, థియేటర్ల నియంత్రణకు సంబంధించి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు, వైద్యులు సూచించారు.