Tag Archives: complainant

యువి క్రియేషన్స్ పై హైదరాబాద్ సిటీ పోలీసులకు కంప్లైంట్.. పోలీసులు అదిరిపోయే రిప్లై?


ఈ బ్యానర్ పై ఎన్నో హిట్ సినిమాలు కూడా వచ్చాయి. శ‌ర్వానంద్ తో ర‌న్ రాజా ర‌న్‌, నానితో భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, అనుష్క‌తో భాగ‌మ‌తి, ప్ర‌భాస్ తో సాహో ఇలా సూపర్ హిట్ సినిమాలను చేసిన యూవీ క్రియేషన్స్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా చేస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇటీవల ప్రభాస్ అభిమాని ఒకరు అందరి హీరోలకు సంబంధించిన సినిమాలు అప్ డేట్ వస్తున్నాయి కానీ.. ప్రభాస్ కు సంబధించిన సినిమా రాధేశ్యామ్ గురించి మాత్రం ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వడం లేదని.. సూసైడ్ నోట్ రాసిన విషయం తెలిసిందే. అయితే 15 వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడించారు. దీంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.అయితే ఐదు గంటలకు ఫస్ట్ సింగిల్ విడుదల చేయకపోగా 8 గంటలకు వాయిదా వేశారు. ఎనిమిది గంటలకు కూడా విడుదల చేయకపోవడంతో ఎంతో విసిగిపోయిన అభిమానులు ట్విట్టర్ లో హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.

సార్ యూవీ క్రియేషన్స్ వంశీ ప్రమోద్ తమ ఎమోషన్స్ తో ఆడుకుంటుంన్నాడు సార్.. అతడిపై చర్యలు తీసుకోండి అంటూ ట్వీట్ చేశాడు. దానికి హైదరాబాద్ పోలీసులు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. మీకు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయండి అంటూ రీట్వీట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. అందరు హీరోలకు ఒక ప్రాబ్లమ్ ఉంటే.. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ వింత సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే అభిమాని హైదరాబాద్ సిటీ పోలీసులకు కంప్లైంట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి రాధేశ్యామ్ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కావడంతో అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

మిగిలిన హీరోల ఫ్యాన్స్ తమ హీరోలు ఇయర్ కి ఒకటి రెండు సినిమాలు తీయాలి అని, వాటి లుక్స్, అప్ డేట్స్, టీసర్స్ ట్రైలర్ సాంగ్స్ ఇలా వీటితో ఫుల్ బిజీగా ఉంటుంటే.. ప్రభాస్ కు మాత్రం బాహుబలి తర్వాత నిరాశే ఎదురవుతోంది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ప్రాజెక్ట్ కి మరింత టైం పడుతుంది. ఒక్కో సినిమాకి ఇప్పుడు రెండేళ్ళకి మించి టైం పడుతుంది, దాంతో ఫ్యాన్స్ కోరుకునే అప్ డేట్స్ అస్సలు రావడం లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి చెర్రెత్తుతోంది. అంతక ముందు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ యువీ క్రియేషన్స్ పై నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మళ్లీ అదే ట్రెండ్ కొనసాగేలా ఉంది.