Tag Archives: Coronavirus symptoms

కరోనా వైరస్ సెకండ్ వేవ్ లక్షణాలు ఇవే..!

దేశవ్యాప్తంగా గత సంవత్సర కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించడంతో ప్రజలు ఎంతో భయాందోళన చెందారు. అయితే మొదటి దశలో కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ రెండవ దశలో మాత్రం మరణాల సంఖ్య అధికంగా పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. అయితే మొదటి దశలో కరోనా లక్షణాలు సాధారణంగా జలుబు, దగ్గు, రుచి తెలియకపోవటం, వాసన గుర్తించకపోవడం, నీరసం, అలసట వంటి లక్షణాలు ఉండేవి.

కరోనా రెండవ దశ తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ కొందరిలో ఈ లక్షణాలు అధికంగా ఉన్నాయి. మరి కొందరిలో ఈ లక్షణాలు కనిపించక పోయినప్పటికీ కరోనా బారిన పడుతున్నారు.అయితే రెండవ దశలో కరోనా లక్షణాలు మొదటి దశ లక్షణాలతో పాటు మరికొన్ని కొత్త లక్షణాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ కొత్త లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం…

కరోనా రెండవ దశలోని లక్షణాలలో మొదటగా శ్వాస తీసుకోవడం ఎంతో ఇబ్బందికరంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.చాలా మంది కరోనా బారిన పడిన వారిలో ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపించాయని నిపుణులు గుర్తించారు. అదేవిధంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. దీని కారణంగా వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలకు  తలెత్తుతున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.

అదే విధంగా కొంతమందిలో వినబడక పోవడం వంటి లక్షణాలు కూడా తలెత్తుతున్నాయి. కరోనా వైరస్ సోకిన కేవలం వారం లోపలే కొందరిలో ఈ విధమైనటువంటి సమస్య తలెత్తుతుంది. ఈ వైరస్ బారిన పడిన వారిలో రోగ నిరోధక శక్తి కోల్పోవటం వల్ల నీరసం అవుతున్నారు. అదేవిధంగా కళ్ళు ఎర్రగా ఉండటం, నోరు ఆరిపోవడం, డయేరియా, తలనొప్పి, చర్మ సమస్యలు వంటి లక్షణాలు కూడా రెండవ దశలో కనిపిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు.