Tag Archives: cricket

సిక్సర్ల రారాజు వచ్చేశాడు.. గేల్, రస్సెల్ ను మించిపోయాడుగా.. ఎవరంటే..?

క్రికెట్ అనేది మనకు తెలిసి మూడు ఫార్మట్లలో నడుస్తోంది. అది టీ20, వన్డే (50 ఓవర్లు) మరియు టెస్టు. ఇందులో చాలామంది ఎక్కువగా టీ20 ఫార్మాట్ ను ఇష్టపడతారు. ఎందుకంటే బాల్స్ తక్కువగా ఉంటాయి. బ్యాట్స్ మెన్ క్రీజ్ లోకి వచ్చిన దగ్గర నుంచి దూకుడుగా ఆడటానికే ప్రయత్నిస్తుంటారు. దీంతో చూసే వారికి ఆ జోష్ వేరే ఉంటుంది.’

ఇలా ఆ బ్యాట్స్ మెన్ వచ్చిన బంతులకు ఫోర్లు, సిక్స్ లు కొడుతుంటే ఆ కిక్కే వేరప్ప అన్నట్లు ఉంటుంది. అందుకే ఈ పొట్టి ఫార్మాట్ ను అందరూ ఇష్టపడతారు. సిక్స్ లు కొడుతుంటే.. అభిమానులు చప్పట్లు కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇందులో ఓ ఆటగాడు వచ్చాడు. ఈ కొత్త ఆటగాడు సిక్సర్ల రారాజుగా పేరుపొందాడు. ఇప్పటి వరకు ఎక్కువగా సిక్స్ లు కొట్టిన వాడిగా క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, మ్యాక్స్ వెల్ లను చెప్పుకుంటాం.

ఇక వాళ్లందరినీ పక్కన పెట్టేసి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు ఈ యువ క్రికెటర్. అతడు ఎవరంటే.. న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్. ఈ సంవత్సరంలో ఎక్కువ సిక్స్ లు కొట్టినది ఇతడే. ఇతడు న్యూజిలాండ్ కు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్నాడు. అతడు ఓ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. జిమ్ చేయడం వల్లనే తాను సిక్స్ లను ఎక్కువగా కొడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రతీ రోజు జిమ్ కు వెల్లడంతో శరీరం ఆకృతి మారి ఫిట్ గా ఉంటానన్నారు.

గ్లెన్ ఫిలిప్స్ 2021వ సంవత్సరంలో మొత్తంగా చూస్తే 89 సిక్సర్లు కొట్టి రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ సిక్స్ లకు అతడు ఆడిన మ్యాచ్ లు ఎన్నో తెలుసా.. కేవలం 48 మాత్రమే. దీంతో అతడు 9 అర్థ సెంచరీలు చేశాడు. రెండో స్థానంలో 82 సిక్సర్లతో ఇంగ్లాండ్ క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టన్ నిలిచాడు. మూడో స్థానంలో 9 మ్యాచ్‌ ల్లోనే 75 సిక్సర్లు కొట్టి.. ఎవిన్ లూయిస్ నే వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ నిలిచాడు. అందరికీ సుమపరిచతమైన పేరు ఆండ్రీ రస్సెల్. వెస్టిండిస్ క్రికెటర్ అయిన ఇతడు 50 సిక్లర్లు మాత్రమే కొట్టాడు. ఇక గేల్ వచ్చేసి 41 సిక్సర్లు బాదాడు. మక్స్ వెల్ 35 కొట్టాడు. మిగతా ఆటగాళ్లతో పోలిస్తే.. ఫిలప్స్ ఎక్కువ టీ20 మ్యాచ్ లు ఆడాడు. అందుకనే ఈ ఫీట్ సాధించాడాని చాలామంది అంటున్నారు.