Tag Archives: cytomegalovirus

కరోనా బాధితులను కలవరపెడుతున్న మరో వైరస్… ఏమిటంటే?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ బారిన పడిన వారిని వివిధ రకాల బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ వంటి వివిధ రకాల వైరస్ లు వ్యాప్తి చెంది ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశాయి. ఈ విధమైనటువంటి వైరస్ వ్యాప్తి జరిగే కొందరు మరణం కూడా పొందారు.అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకునే లోపే కరోనా బాధితులలో మరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది.

ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ఐదుగురు కరోనా బాధితులలో సిఎంవి ఇన్ఫెక్షన్ లేదా సైటోమెగలో వైరస్ బారిన పడినట్టు గుర్తించారు. అయితే వీరిలో ఇప్పటికే ఒకరు మృతి చెందారు. ఈ విధంగా ఈ కొత్త ఇన్ఫెక్షన్ కరోనా బాధితుల లో బయటపడటం ఇదే మొట్టమొదటిసారి.కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సుమారు నెల రోజుల వ్యవధిలో ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించామని నిపుణులు చెబుతున్నారు.

ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ కరోనా సోకిన వ్యక్తి రక్తం, మూత్రం,లాలాజలం వంటి శరీర ద్రవాల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుందని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు. శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భాటియా హాస్పిటల్ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ విపుల్‌రాయ్ రాథోడ్ మాత్రం ఇది సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ అని తెలిపారు.

సాధారణంగా గొంతు నొప్పి, కండరాల నొప్పి, అలసట జ్వరం దగ్గు గ్రంథుల వాపు వంటి లక్షణాలు ఈ ఇన్ఫెక్షన్లు కనిపిస్తాయి. అయితే వీటిని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించదని ఈ చికిత్సలో భాగంగా యాంటీ వైరల్ మందులు వాడటం వల్ల ప్రమాదం నుంచి బయట పడవచ్చు అని ఈ సందర్భంగా డాక్టర్ విపుల్‌రాయ్ రాథోడ్ తెలిపారు.