Tag Archives: damaging cars

ఈ రెండు కాకులు రౌడీలంటా.. పోలీసులకు ఫిర్యాదు!

సాధారణంగా మనం పంట పొలాల్లో పక్షులు పంటను నాశనం చేయకుండా ఉండాలని పంట పొలాల్లో దిష్టి బొమ్మలను పెట్టడం చూస్తుంటాము. ఈ విధంగా దిష్టిబొమ్మలు ఉండటం వల్ల ఎలాంటి పక్షులు ఆ దరిదాపుల్లోకి రావు.పంట పొలాలలో పెట్టె దిష్టిబొమ్మలు యూకేలో ప్రతి ఇంటి ముందు పెడుతున్నారు. అదేంటి దిష్టి బొమ్మలు ఇంటికి పెట్టుకోవడం ఏంటని అనుకుంటున్నారా… సాధారణంగా దిష్టిబొమ్మలు మన ఇంటి పై ఎటువంటి చెడు దృష్టి పడకుండా ఉండటం కోసం పెట్టుకుంటాము. కానీ యుకెలో వారు మాత్రం కాకుల బెడద తట్టుకోలేక ప్రతి ఇంటి ముందు ఈ విధంగా దిష్టిబొమ్మలను పెట్టిన ఘటన చోటు చేసుకుంది… అసలేం జరిగిందంటే…

యూకేలో కార్లిస్లే అవెన్యూ, లిటిల్ఓవర్ ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి కార్ల విండ్‌స్క్రీన్, వైపర్‌లు పాడవుతున్నాయి. ఎవరో కార్ల మీద గీతలు పెడుతున్నారు. అద్దాలు పగలగొడుతున్నారు. విలువైన వస్తువులను దొంగతనం చేస్తూ వెళుతున్నారు.అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారని భావించిన ఆ ప్రాంతవాసులు కొందరి యువకులను కాపలాగా నియమించారు. అయితే కాపలాగా ఉన్న ఆ యువకులకి ఒక షాకింగ్ విషయం తెలిసింది.

ఇన్ని రోజుల నుంచి తమ కార్ల విండ్ స్క్రీన్లను పగలగొట్టి, విలువైన వస్తువులను దొంగతనం చేస్తూ ఉన్నది మనుషులు కాదు.. కాకుల అని తెలియడంతో ఆ ప్రాంత వాసులు అందరూ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. కేవలం రెండు కాకులు ప్రతిరోజూ ఈ విధంగా కనిపించి కార్ల పై దాడి చేస్తూ ఎంతో నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఈ కాకుల దాడిని భరించలేక నగరవాసులు కాకుల పై చర్య తీసుకోవాలని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విధంగా పలుమార్లు కాకులను తరుముతూ ఉన్నప్పటికీ అవి వెళ్ళినట్టే వెళ్లి మరి వచ్చి విధ్వంసం సృష్టించే.కేవలం రెండు కాకుల మాత్రమే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని. కేవలం కార్లపై మాత్రమే కాకుండా నడుస్తూ వెళుతున్నటువంటి మనుషులపై కూడా దాడి చేయడంతో విసిగిపోయిన ఆ కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన రాయల్ సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ అధికారి మాట్లాడుతూ కార్ల అద్దాలలో పక్షులు చూసుకోవడం సర్వసాధారణమే, అయితే వాటిని చంపడానికి వేరే పక్షులు వచ్చాయని భావించి అవి వాటిని తరమడానికి ముక్కుతో పొడుస్తూ ఉండడం సర్వసాధారణమే అని తెలిపారు. ఈ విధంగా కార్ల విండోస్ కు క్లాత్ పెట్టినప్పటికీ వాటి పనిని మాత్రం ఆపలేదు.

ఈ విధంగా ఎంతో విధ్వంసం సృష్టిస్తున్న ఈ రౌడీ కాకులకు ఆ ప్రాంత వాసులు తూర్పు లండన్‌లో 50-60 దశకాల్లో పేరొందిన అండర్ వరల్డ్ కవల సోదరులు రోనీ, రెగీ పేర్లు పెట్టారు.ఈ కాకుల చేష్టలకు విసుగుచెందిన ఆ ప్రాంతవాసులు వాటిని మచ్చిక చేసుకోనీ ఈ నష్టాన్ని తప్పించాలని వాటికి ఆహారం పెడుతూ ఉన్నారు.