Tag Archives: Dasharath

రామ.. రామ అయేద్య రాముడి పేరుపై ట్రాఫిక్ చలానా.. సీటు బెల్టు పెట్టుకోలేదని..!

దేశంలో ఏ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ అయినా.. నిబంధనలకు విరుద్దంగా ఏ వాహనదారుడు అయినా వ్యవహరిస్తే అతడికి ఫైన్ వేస్తారు. అక్కడ ఆ నిబంధనకు అనుగురణంగా వాళ్లు ఫైన్ల రూపంలో డబ్బులను వసూలు చేస్తారు. అయితే కేరళలోని ట్రాఫిక్ పోలీసులు కాస్తంత అతి చేశారనే అనిపిస్తుంది. ఈ ఘటన చూసిన తర్వాత మీకు కూడా అదే అనిపిస్తుంది.

ఫైన్ వేసిన తర్వాత అతడి పేరుతో రసీదు ఇవ్వడం అనేది ట్రాఫిక్ పోలీసుల మొదటి కర్తవ్యం. అయితే ఇక్కడ కేరళ ట్రాఫిక్ పోలీస్ మాత్రం అయోద్య రాముడి పేరుమీద చలాన్ రాసి ఇచ్చాడు. ఇంతకు ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.. కేరళలోని కొల్లాం జిల్లా చాడమంగళంలో ఓ వ్యక్తిని సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని ట్రాఫిక్‌ పోలీసుల ఆపి రూ.500 ఫైన్ వేశారు. అయితే ఇదే కారణంతో అతడు ఒక గంట ముందు ఫైన్ కట్టాడు.

తాను అంతక ముందే కట్టాను అని వాళ్లకు చెప్పినా వినలేదు.. ఇక్కడ కూడా కట్టాలని వాళ్లు చెప్పారు. ఇక ఆ వాహనదారుడు చేసేది లేక అసలు పేరు కాకుండా అతడు.. తన పేరు రామా అని.. తన తండ్రి పేరు దశరథ అని.. ఊరు అయోద్య అని చెప్పాడు. కానీ పోలీస్ ఇవన్నీ వివరాలను ఆ రశీదు పై ఏ మాత్రం సందేహం రాకుండా రాశాడు. ఫైన్ వేశామా.. డబ్బు వసూలు చేశామా అన్నట్లే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కానీ.. వాహనదారుడు ఏ పేరు చెబితే మా కేంటి అన్నట్లు ఉంటుంది.

అలాగే అతడు రసీదు రాసి ఇచ్చాడు. అయితే వాహనదారుడు దానికి సంబంధించి రశీదును సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పోస్టు వైరల్ గా మారింది. నెటిజన్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అతడు చెప్పే పేరు, ఊరును కూడా అడగకుండా ఇలా రశీదు ఎలా రాస్తారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కేరళలో పోలీసులు కారణం లేకుండా ఫైన్లు వేస్తున్నారంటూ.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.