Tag Archives: deep dive in dubai

ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

సాధారణంగా స్విమ్మింగ్ పూల్ ఎంత లోతు ఉంటాయో మనకు తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్ ను దుబాయ్ పరిచయం చేస్తుంది. దుబాయ్ లో కేవలం అందమైన హోటల్లు, ద్వీపాలే కాదు.. ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్ ను కూడా మనకు పరిచయం చేస్తుంది.అయితే, సాదాసీదా స్విమ్మింగ్‌పూల్ కాదు. ఇందులో ఓ అద్భుత లోకం దాగి ఉంది. కొన్ని అంతస్తుల లోతులో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో డ్రైవింగ్ చేస్తూ బయట ప్రపంచాన్ని చూడవచ్చు.

దుబాయ్ యువరాజు హమ్‌దన్ బిన్ మొహమ్మద్ ప్రారంభించిన ఈ స్విమ్మింగ్‌పూల్ అద్భుతాన్ని మాటలలో వర్ణించలేము.డీప్ డైవ్ దుబాయ్ పేరుతో దుబాయ్ ప్రభుత్వం దీనిని నిర్మించింది. ప్రపంచంలో ఇంత లోతైన స్విమ్మింగ్ పూల్ ఎక్కడా లేకపోవడంతో ఈ స్విమ్మింగ్ పూల్ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.

ఈ స్విమ్మింగ్‌పూల్2ను నాడ్ అల్ షేబా ప్రాంతంలో నిర్మించారు. దుబాయ్ యువరాజు హమ్‌దన్ బిన్ మొహమ్మద్ ప్రారంభించారు. ఈ స్విమ్మింగ్ పూల్ లోతు 60 మీటర్లు (196 అడుగులు). ఈ స్విమ్మింగ్‌పూల్ పూర్తిగా నిండాలంటే 1.4 కోట్ల లీటర్లు నీరు అవసరం.ఇంత లోతైన స్విమ్మింగ్ పూల్ శుభ్రం చేయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని కావడంతో దీనిని శుభ్రపరచడానికి నాసా రూపొందించిన ఫిల్టర్ టెక్నాలజీని వాడుతున్నారు.

ఈ స్విమ్మింగ్ పూల్ లో డ్రైవింగ్ చేస్తూ ఎన్నో అద్భుతాలను వీక్షించవచ్చు. స్విమ్మింగ్ పూల్ లో అడుగుభాగాన కాసేపు సేద తీరడం కోసం కుర్చీలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మునిగిపోయిన ఇల్లు, అడవి ఏవిధంగా ఉంటాయో ఆ దృశ్యాలు అన్నింటినీ కూడా ఇక్కడ ఈ కొలనులో చూడవచ్చు.ప్రపంచంలో ఇప్పటివరకు లోతైన డీప్ డైవింగ్ పూల్ రికార్డు పోలాండ్‌లో గల ‘డీప్ స్పాట్’ పేరు మీద ఉంది. మరి ఎంతో అందమైన ఈ స్విమ్మింగ్ పూల్ కి సంబంధించిన వీడియో పై ఓ లుక్ వేయండి.