Tag Archives: Employees of Central Public Sector Enterprises

కేంద్రం సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు భారీ షాక్..?

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. దాదాపు రెండున్నర నెలలు సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయడంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థపై సైతం కరోనా మహమ్మారి ప్రభావం పడింది. గతంతో పోలిస్తే కేంద్రానికి ఆదాయం భారీగా తగ్గింది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. తాజాగా కేంద్రం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.

సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ ను నిలిపివేస్తున్నట్టు కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. . సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఇండస్ట్రియల్ డియర్ నెస్ అలవెన్స్ వేతన మార్గదర్శకాలను అనుసరించి వేతనాలను చెల్లిస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నుంచి 2021 సంవత్సరం జూన్ నెల 30వ తేదీ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని కేంద్రం కీలక ప్రకటన చేసింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కరోనా విజృంభణ వల్ల దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సీ.పీ.ఎస్.ఈ ఉద్యోగుల డీఏలకు, అదనపు ఇన్‌స్టాల్‌మెంట్లకు ఇండస్ట్రియల్ డియర్‌నెస్ అలవెన్స్ మార్గదర్శకాలు అమలవుతాయని అందువల్ల డీఏ అదనపు చెల్లింపులు ఉండవని తెలిపింది. 2021 జులై నుంచి కేంద్రం డీఏ చెల్లించనుండగా ఎంతమొత్తం చెల్లించనుందో తెలియాల్సి ఉంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే డీఏ పెంపు ఉండదని కీలక ప్రకటన చేసింది. కేంద్రం డీఏ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రభావం 50 లక్షల మంది ఉద్యోగులతో పాటు 61 లక్షల మంది పెన్షనర్లపై పడటం గమనార్హం.