Tag Archives: fake photos

ఫేక్ ఫోటోలతో ప్రమోషన్ … ఆ దేశ పరువును తీసిన చైనా యువత?

సాధారణంగా వివిధ దేశాలలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను చూడటం కోసం పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వెళుతుంటారు. ఈ క్రమంలోనే పర్యాటకులను ఆకర్షించడం కోసం పర్యాటక శాఖ పర్యాటక ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్జియాపు కౌంటీ అనే సుందరమైన ఒక చిన్న గ్రామం ఎంతో మంది పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించే అందాలు ఆ వూరి సొంతమని చైనా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించింది.

ప్రమోషన్ లో భాగంగానే బీచ్ ఒడ్డున ఎంతో సుందరంగా కనిపించే అందాల నడుమ జాలర్లు చేపలు పట్టడం. పచ్చదనం పొగ మంచులలో పక్షుల సందడి,వెరసి చైనాలోని రూరల్‌ టౌన్‌ గ్జియాపు కౌంటీని సుందర ప్రాంతంగా ప్రకటించుకుంది చైనా పర్యాటక శాఖ. అయితే వీటిని చూసిన ఇతర విదేశీ పర్యాటకులు ఆ ప్రదేశాలకు పెద్దఎత్తున అక్కడి ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లారు. కానీ ఆ ప్రదేశంలో అలాంటి సుందరమైన అందాలు కనిపించక పోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు.

ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రచారం అంతా పైన పటారం లోన లొటారం అంటూ అసలు ఫోటో షూట్లను బయటపెట్టి చైనా ప్రభుత్వం బండారాన్ని చైనా దేశానికి చెందిన కొందరు యువత బయటపెట్టారు.అంతేకాకుండా ఆ ఫోటోలో ఉన్నది నిజం కూలీలు రైతులు కాదని ,వాళ్ళందరూ కూడా మోడల్స్ అని వారి కోసం చాలా డబ్బులు వెచ్చించారని అసలు విషయాన్ని బయటపెట్టారు.

ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం స్పందించి కరోనా కారణం వల్ల ఎంతో ఆర్థికంగా దెబ్బతిన్న ఆ గ్రామానికి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి ఆలోచన చేసినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం కూడా ప్రచురించింది. అయితే ఆర్థికంగా వెనుకబడిన గ్రామాన్ని ఆర్థికంగా నిలబెట్టడం ఒక మంచి పని అయినప్పటికీ ఈ విధంగా మోసపూరితంగా వచ్చిన ఆదాయంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం దేశానికి పరువు తీసే అంశమని భావించిన యువత అసలు విషయాన్ని బయటపెట్టారు.