Tag Archives: habits

Chanakya Niti: డబ్బు వృధా కాకూడదంటే చాణిక్యుడు చెప్పిన ఈ అలవాట్లు మానుకోవాలి?

Chanakya Niti: ఆచార్య చాణిక్యుడు నీతి గ్రంథం ద్వారా ఒక మనిషి ఉన్నత మార్గంలో ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. అయితే ఒక మనిషి తను అనుకున్న లక్ష్యాలను నెరవేరాలన్న ,జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని తన నీతి గ్రంథం ద్వారా తెలిపారు.అదేవిధంగా మన దగ్గర ఉన్న డబ్బు వృధా కాకుండా ఉండాలన్న లేదా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలన్న తప్పనిసరిగా కొన్ని సూత్రాలను పాటించి.. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిదని చాణిక్య నీతి గ్రంధం ద్వారా తెలిపారు. మరి ఆ అలవాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

Chanakya Niti: డబ్బు వృధా కాకూడదంటే చాణిక్యుడు చెప్పిన ఈ అలవాట్లు మానుకోవాలి?

కోపం: కోపం మనిషి నాశనానికి పునాది. కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎంతో ప్రమాదకరంగా ఉంటాయి. ఎప్పుడైతే ఒక మనిషి కోపం వ్యక్తం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటారు అలాంటివారు నష్ట పోవడమే కాకుండా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది అందుకే కోపం మానుకోవాలని తెలిపారు.

Chanakya Niti: డబ్బు వృధా కాకూడదంటే చాణిక్యుడు చెప్పిన ఈ అలవాట్లు మానుకోవాలి?

అహంకారం: మనకు లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఉండి మన డబ్బు మన దగ్గర ఉంది అంటే ఆ డబ్బును సరైన మార్గంలో సద్వినియోగం చేసుకున్నప్పుడే అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుంది అంతే కానీ ఆ డబ్బులు అహంకారంతో దుర్వినియోగం చేసుకుంటే లక్ష్మీదేవి కొలువై ఉండదని చాణిక్యుడు తెలిపారు.

అత్యాశ: ఒక మనిషి ఎప్పుడైతే అత్యాశతో డబ్బు సంపాదించాలని చెడుమార్గంలో ప్రయాణం చేస్తే అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉండదు. కనుక మనం కష్టపడి సరైన మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.

సోమరితనం విడిచిపెట్టడం..

లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలగాలంటే తప్పనిసరిగా మనకు పెద్ద శత్రువు అయిన సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే సోమరితనం ఉంటుందో అప్పుడు డబ్బులు కూడా వృథాగా ఖర్చు అవుతాయి అందుకే సోమరితనం విడిచిపెడితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు.