Tag Archives: housing loan offers

ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. వాటి రేట్లు తగ్గిస్తూ నిర్ణయం..

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటూ పెద్దలు అంటుంటారు. ఎందుకంటే అవి జీవితంలో చేసే పెద్ద కార్యాలు లాంటివి. అందుకే పెద్దలు అలా అంటుంటారు. అయితే చాలామందికి సొంత ఇల్లు ఉండాలనే కల ఉంటుంది. ఇప్పుడు ఆ కలను సాకారం చేసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే ఆఫర్లు ఇచ్చింది. గృహ రుణాలపై తమ ఖాతాదారులకు 6.70 శాతం వడ్డీతో హోమ్ లోన్స్ అందించనున్నట్లు వెల్లడించింది.

ఎంత మొత్తం రుణం తీసుకున్నా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని చెప్పారు. క్రెడిట్ స్కోర్ ఆధారంగానే ఈ రుణాలను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతకముందు రూ. 75 లక్షల రుణాలపై 7.15 శాతంగా వడ్డీని చెల్లించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అంతే మొత్తానికి 6.7 శాతం మాత్రమే వడ్డీని వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఇలా 30 ఏళ్ల కాలానికి దాదాపు రూ. 8లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపింది ఎస్బీఐ. ప్రాసెసింగ్ ఫీజు కూడా పూర్తిగా రద్దు చేశారు.

ఏ ఉద్యోగం చేస్తున్నా.. ఏ వ్యాపారం చేస్తున్నా ఈ రుణాలను అందిస్తామని బ్యాంక్ అధికారులు తెలిపారు. అందరికీ 6.7 శాతం వడ్డీనే వర్తిస్తుందని పేర్కొన్నారు. ఎస్బీఐ ఖాతాదారులకు ఇదొక మంచి శుభవార్త అంటూ చెప్పారు ఎస్‌బీఐ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌(రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌) సి.ఎస్‌.శెట్టి తెలిపారు.

ఇదిలా ఉండగా.. ప్రైవేట్ రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ గత వారం గృహ రుణాల వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.15 శాతం తగ్గించింది. గృహ రుణ వడ్డీ రేటు 6.65 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గింది. కస్టమర్లకు సరసమైన గృహ రుణ రేట్లు నవంబర్ 8, 2021 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.