Tag Archives: ibomma

Ibomma Website: యూజర్లకు గట్టి షాక్ ఇచ్చిన ఐబొమ్మ.. అసత్య ప్రచారాలు రావడంతో వెబ్ సైట్ మూసివేత?

Ibomma Website: కరోనా వచ్చిన తర్వాత థియేటర్లు మూతపడటంతో ఓటీటీలకు మంచి ఆదరణ పెరిగింది. అయితే ఈ ఓటీటీల ద్వారా ఎన్నో రకాల వెబ్ సిరీస్ లు, సినిమాలు, టాక్ షోలు చూసే అవకాశం కల్పించారు. అయితే ప్రతి ఒక్క యూజర్ వీటిని సబ్స్క్రిప్షన్ చేసుకోవాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది అందరికీ సాధ్యమైన పని కాదు కనుక యూజర్ల కోసం ఎన్నో రకాల వెబ్ సైట్ అందుబాటులోకి రావడమే కాకుండా ఉచితంగా సినిమా చూసే వెసులుబాటు కల్పించారు.

Ibomma Website: యూజర్లకు గట్టి షాక్ ఇచ్చిన ఐబొమ్మ.. అసత్య ప్రచారాలు రావడంతో వెబ్ సైట్ మూసివేత?

ఈ విధంగా అందుబాటులోకి వచ్చిన వెబ్ సైట్ ఐ బొమ్మ. ఈ వెబ్ సైట్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి ఆదరణ లభించింది. నిజానికి ఇలా వెబ్ సైట్ ద్వారా సినిమాలను ప్రసారం చేయడం పూర్తిగా తప్పు అయినప్పటికీ ఈ వెబ్ సైట్ అభిమానుల కోసం సినిమాలను ప్రసారం చేస్తూ వచ్చారు.అయితే తాజాగా ఈ వెబ్ సైట్ నిర్వాహకులు వెబ్ సైట్ పట్ల అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉండదని దీనిని మూసివేస్తున్నారు అంటూ ప్రకటించారు.

Ibomma Website: యూజర్లకు గట్టి షాక్ ఇచ్చిన ఐబొమ్మ.. అసత్య ప్రచారాలు రావడంతో వెబ్ సైట్ మూసివేత?

ఈ విధంగా వెబ్ సైట్ మూసి వేయడానికి గల కారణాలను కూడా నిర్వాహకులు చెప్పుకొచ్చారు. క్లౌడ్ సర్వర్లను 99.999% అప్‌ టైమ్, విడ్త్ తో నిర్వహించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అప్పటికి మాకు సాధ్యమైనంతవరకు మా సేవలను అందించడానికి ప్రయత్నం చేస్తాము. ఈ క్రమంలోనే కొందరు యూట్యూబ్ ఛానల్స్ మా గురించి తప్పుడు ప్రచారాలు చేశారు. మేము సినిమాలకు మాల్ వేరే లింక్ పెట్టీ యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నామని అసత్య ప్రచారాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రకటించారు.

ఈ సైట్ ద్వారా మాకు ఎలాంటి ఆదాయం లేదు..

ఈ విధంగా మా గురించి తప్పుడు వార్తలు వస్తున్నప్పటికీ మాకు మద్దతుగా ఎవరు నిలబడలేదని అయితే ఈ వెబ్ సైట్ ద్వారా సినిమాలు ఉచితంగా చూడటానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు కానీ ఈ అసత్య ప్రచారాలను ఎవరు తిప్పికొట్టలేదని ఐ బొమ్మ నిర్వాహకులు వెల్లడించారు.నిజానికి ఈ వెబ్ సైట్ ద్వారా మాకు ఏ విధమైనటువంటి ఆదాయం రాదు కొన్నిసార్లు మేమే అధిక ఖర్చును భరించాల్సి వస్తుందని, ఇలాంటి ఖర్చులను భరించడమే కాకుండా పైగా మా గురించి అసత్య ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.