Tag Archives: India has lost

పాఠశాలల మూసివేతతో భారత్ ఎంత నష్టపోయిందో తెలుసా..!

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల 2020 సంవత్సరం మార్చి నెల 3వ వారం నుంచి దేశంలో పాఠశాలలు మూతబడ్డాయి. ఆ తరువాత పాఠశాలలు ఇప్పటివరకు తెరుచుకోలేదు. రోజులు గడుస్తున్నా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూ ఉండటంతో పాఠశాలలు తెరిచినా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలలకు పంపించే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. దేశంలోని చాలా విద్యాసంస్థలు ఆన్ లైన్ ద్వారా బోధన జరుపుతున్నాయి.

కరోనా వైరస్ కు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాటు సాధారణ పరిస్థితులు ఏర్పడితే మాత్రమే విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆన్ లైన్ ద్వారా విద్యా బోధాన జరిగినా పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు అర్థం కావడం లేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ పూర్తిగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదే సమయంలో స్కూళ్లు మూసివేయడం వల్ల భారత్ కు భారీ నష్టం వాటిల్లుతోందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. విద్యాసంస్థలు మూసివేయడం వల్ల ఏకంగా భారత్ కు 29 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వెల్లడించింది. కరోనా, లాక్ డౌన్ దేశ ఆర్థికవ్యవస్థపై మాత్రమే ప్రభావం చూపలేదని విద్యార్థుల్లో చదువుకోవాలనే ఆసక్తి తగ్గడానికి కూడా కారణమైందని వెల్లడించింది.

పపంచ బ్యాంకు దక్షిణాసియాలో విద్యాసంస్థల మూసివేత వల్ల 880 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ నుంచి “బీటెన్ ఆర్ బ్రోకెన్.. ఇన్ ఫర్మాలిటీ అండ్ కోవిడ్-19 ఇన్ సౌతిండియా” అనే పేరుతో ఈ మేరకు నివేదిక విడుదలైంది. కరోనా, లాక్ డౌన్ విద్యార్థుల ఉత్పాదకతపై జీవితకాల ప్రభావం చూపుతుందని.. దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్స్ గా మిగిలిపోయే అవసరం ఉందని.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా, లాక్ డౌన్ కోలుకోలేని దెబ్బ తీసిందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.