Tag Archives: india vaccination

వ్యాక్సిన్ కొనడంలో కేంద్రం తప్పు చేసింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన టాప్ వైరాలిజిస్ట్..?

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. వ్యాక్సిన్ కొనుగోలు, వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కేంద్ర ప్రభుత్వం అలసత్వం, నిర్లక్ష్యం వల్లనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యమైందని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వ్యాక్సినేషన్ కొనుగోలు విషయంలో ఎంతో ఆలస్యం చేసిందని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాలు ఒక ఏడాదికి సరిపడా వ్యాఖ్యలను కొనుగోలు చేసింది. ఇలాంటి సమయంలో మనం వెళ్లి వ్యాక్సిన్ కొనుగోలు చేయాలన్న మార్కెట్ లో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాపించి ఉంది. మరికొద్ది రోజుల్లో మూడవ దశ కూడా వ్యాపించి ఉందని అధికారులు హెచ్చరిస్తున్న సమయంలో పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రయత్నిస్తున్నాయి.అయితే ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొరత తీవ్రంగా ఉండటంతో పలు రాష్ట్రాలలో వ్యాక్సినేషన్ కేంద్రాలు మూత పడ్డాయి. అమెరికా వంటి దేశాలు వ్యాక్సిన్ కోసం గత ఏడాది మార్చి లోని 10 బిలియన్ డాలర్లు కేటాయించింది. కానీ, భారత్ మాత్రం వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఒక్క పైసా ఖర్చు చేయక పోవడమే కాకుండా వ్యాక్సిన్ కొనుగోలు చేయలేకపోయింది.

అమెరికా ఐరోపా వంటి దేశాలు నవంబర్ నెలలోనే సుమారు 700 మిలియన్ డోస్ ల వ్యాక్సిన్ లను ముందుగా ఆర్డర్ చేశాయి. అయితే అప్పటికి భారత దేశంలో ఇంకా క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతూ ఉన్నాయి. భారత దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే భారతదేశంలో లభిస్తున్న టువంటి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ 11 మిలియన్ డోస్‌లు, భారత్ బయోటెక్ 5.5 మిలియన్ డోస్‌లు తొలి దశలో సరఫరా చేశాయి. ఇప్పటికైనా వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని, లేదంటే పెద్ద మొత్తంలో నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలియజేశారు.