Tag Archives: internet technology

JIO: ఒక్క క్లిక్ చాలు ప్రపంచం మీ ముందరే.. ! సరికొత్త ఇంటర్నెట్ టెక్నాలజీతో ముందుకు రానున్న రిలయన్స్ జియో..!

JIO: భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు ముందు జియో తర్వాత అని చూసుకోవాలి. అంతగా టెలికాం రంగంలో విప్లవానికి నాంది పలికింది. 4జీ నెట్వర్క్ గ్రామస్థాయి వరకు తీసుకుపోవడానికి సహాయపడింది. జియో దెబ్బకి అప్పటివరకు ఉన్న టెలికాం సంస్థలకు భారీ దెబ్బ పడింది. దేశంలో ప్రతి మూలకు ఇంటర్నెట్ చేరడంలో సక్సెస్ అయింది.

JIO: ఒక్క క్లిక్ చాలు ప్రపంచం మీ ముందరే.. ! సరికొత్త ఇంటర్నెట్ టెక్నాలజీతో ముందుకు రానున్న రిలయన్స్ జియో..!

తాజాగా మరో సంచలనానికి రిలయన్స్ జియో నాంది పలుకుతోంది. ఒక్క క్లిక్ తోనే మూడు గంటల సినిమా డౌన్ లోడ్ అయిపోతుంది. దేశంలోని మారుమూల పల్లెల్లో కూడా ఇంటర్నెట్ సేవలు పరుగులు తీస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలలో సర్వర్ డౌన్ అనే మాట ఉండదు.

JIO: ఒక్క క్లిక్ చాలు ప్రపంచం మీ ముందరే.. ! సరికొత్త ఇంటర్నెట్ టెక్నాలజీతో ముందుకు రానున్న రిలయన్స్ జియో..!

ఏకంగా 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లిన ఫుల్ సిగ్నల్ వచ్చే విధంగా ఇంటర్నెట్ విప్లవానికి రిలయన్స్ జియో నాంది పలుకనుంది. శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ అందించేందుకు రెడీ అయ్యింది.


మల్టీ ఆర్బిట్ స్పేస్ టెక్నాలజీ ..

ఇందుకోసం రిలయన్స్ జియో లక్సెంబర్గ్ ఎస్ఈఎస్ జాయింట్ వెంచర్ ప్లాన్ చేసింది. ఈ జాయింట్ వెంచర్ లో జియోలో 51 శాతం వాటా, ఎస్ఈఎస్ కి 49 శాతం వాటా ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీతో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోని ఏ మూలకు అయినా శాటిలైట్ తోనే ఇంటర్నెట్ సర్వీసులు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మల్టీ ఆర్బిట్ స్పేస్ టెక్నాలజీ నెట్వర్క్ ద్వారా సర్వీసులు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. శాటిటైల్ కంటెంట్ కనెక్టివిటీ లో ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఎస్ఈఎస్ సంస్థ తో  రిలయన్స్ జియో ఈ డీల్ కుదుర్చుకోవడం దేశంలో డిజిటల్ విప్లవానికి మరింత దోహదం చేస్తుందని jio డైరెక్టర్ ఆకాశం అని అన్నారు.