Tag Archives: jewellery design

ఇలా చేస్తే మీ నగలు ఎప్పటికీ మెరిసిపోతాయ్!

ఆడవారి అందాన్ని రెట్టింపు చేసేది నగలు మాత్రమే. ఎంతో అందంగా ముస్తాబైనప్పటికీ మెడలో నగలు లేకపోతే ఏదో పోయినట్టు ఉంటుంది. అందుకే మహిళలు ఎక్కువగా నగలను కొనడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మార్కెట్లోకి వచ్చే వివిధ రకాల డిజైన్లను వారి అభిరుచికి తగ్గట్టుగా కొంటూ ఉంటారు. అయితే ఈ విధంగా కొన్న నగల పట్ల మనం శ్రద్ధ చూపకపోతే అవి తొందరగా పాడవుతాయి. ఎంత ఖరీదు చేసి కొన్న నగలు పాడైతే మనకు చాలా బాధ కలుగుతుంది. ఈ క్రమంలోనే మన నగలు పాడవకుండా ఎప్పటికీ కొత్తవాటిలా మెరిసిపోవాలంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..

మనం ఏదైనా కార్యానీకి వెళ్తున్నప్పుడు అందంగా నగలు ధరించి వెళ్తాము. అయితే ఈవెంట్ ని బట్టి నగలను ఎంపిక చేసుకోవాలి.మనం ఏదైనా శుభకార్యానికి ముస్తాబవుతున్న అప్పుడు ముందుగా మేకప్ వేసుకున్న తరువాత చివరికి నగలను ధరించాలి. ముందుగా మనం మేకప్ వేసుకుని మేకప్ ఆరనివ్వాలి.లేదంటే మేకప్ లో ఉపయోగించే కొన్ని రసాయనాలు బంగారు నగలకు తగలడం ద్వారా నగలు రంగు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

మనం జాగ్రత్తగా ఎత్తి పెట్టిన నగలను ఎలా పడితే అలా కాకుండా.. కాటన్ లో లేదా టిష్యూ పేపర్ లో పెట్టి ఒక బాక్స్ లో భద్రపరచుకోవాలి. ఈ విధంగా భద్రపరచుకున్నప్పుడు ఎటువంటి దుమ్ము ధూళి నగలపై చేరకుండా ఎంతో కొత్తవిగా మెరిసిపోతాయి. అదేవిధంగా నగలపై దుమ్ము ధూళి చేరినప్పుడు మనం వాటిపై అధిక ఒత్తిడిని కలుగజేసి శుభ్రం చేయకూడదు. ఇలా చేస్తే నగలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

మనకు మన బంగారు నగలను శుభ్రం చేయడం తెలియకపోతే ఒకసారి మనం నగలు కొన్న షాప్ వారి సలహా తీసుకొని నగలను శుభ్రపరచుకోవాలి. ముఖ్యంగా నగలను ఎక్కువగా ఎండ తగిలే ప్రదేశాలలో ఉంచకూడదు. ఈ విధంగా నగల పట్ల తరచూ జాగ్రత్తలు తీసుకుంటే మన నగలు ఎప్పుడు కొత్త వాటిలా మెరిసి పోతుంటాయి.