Tag Archives: JNTUH

జేఎన్‌టీయూహెచ్‌ కీలక నిర్ణయం.. ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త..?

భారత్ లో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. వైరస్ విజృంభణ వల్ల చాలా రాష్ట్రాలలో నేటికీ పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోలేదు. ఇప్పటికే పాఠశాలలను తెరిచిన రాష్ట్రాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతూ ఉండటం అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలను టెన్షన్ పెడుతోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్‌ ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

నిబంధనల్లో కీలక మార్పులు చేసి జేఎన్‌టీయూహెచ్‌ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా చేసింది. క్రెడిట్ల విషయంలో, డిస్టింక్షన్ విషయంలో మార్పులు చేసింది. సాధారణంగా జేఎన్‌టీయూహెచ్‌ లో 192 క్రెడిట్లు సాధించిన విద్యార్థులను మాత్రమే పాస్ అయినట్లుగా పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం క్రెడిట్లను ప్రస్తుతం 192 నుంచి 186కు తగ్గించారు. దీంతో క్రెడిట్లు తక్కువగా ఉన్నా ఇకపై పాస్ అయినట్లుగా జేఎన్‌టీయూహెచ్‌ పరిగణిస్తోంది.

సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైన వారికి గతంలోలా కాకుండా రెగ్యులర్ గానే పాసైనట్లు గుర్తించాలని జేఎన్‌టీయూహెచ్‌ భావిస్తోంది. విద్యార్థులు కరోనా వల్ల పనిదినాలను నష్టపోయిన నేపథ్యంలో పలు యూనివర్సిటీలు సిలబస్ లో కీలక మార్పులు చేసి గతంలోలా కాకుండా విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులపై సిలబస్ భారం తగ్గనుంది.

అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంజనీరింగ్ ఫస్టియర్ తరగతులను ప్రారంభించనుంది. ఇప్పటికే ఈ మేరకు ఏఐసీటీఈ నుంచి అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది.