Tag Archives: kamareddy district

రోగనిరోధక శక్తిని పెంచే చికెన్ దమ్ బిర్యాని.. ఎలా చేస్తారు అంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో ప్రజలు ఎంతో భయాందోళనకు గురవుతున్నారు.తాము ఎక్కడ కరోనా బారినపడతామేమోనని అపోహలతోనే కొందరు ప్రాణాలు వదులుతున్నారు.మరి కొందరు మాత్రం మన శరీరంలో వైరస్ తో పోరాడే రోగనిరోధకశక్తి ఉంటే ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని రోగ నిరోధక శక్తి పెంచుకునే మార్గాలను ఎంచుకుంటున్నారు.

ఈ విధంగా రోగ నిరోధక శక్తి పెంచుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాపించదని ప్రచారం జరుగుతోంది. దీనినే ఆసరాగా చేసుకొని ఎంతోమంది వ్యాపారులు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. గత కొద్ది రోజుల వరకు కరోనా వైరస్ తో పోరాడే రోగనిరోధకశక్తి మెరుగుపడాలంటే చికెన్ తినాలనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలోని చికెన్ ధరలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా చికెన్ బిర్యాని తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఓ బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు సరికొత్త ప్రచారానికి తెర లేపాడు.ఈ క్రమంలోనే రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద చికెన్ బిర్యాని అంటూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఈ ఫ్లెక్సీ చూచిన నెటిజన్లు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అయింది.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు చికెన్ బిర్యానీలో వ్యాక్సిన్ కలిపారా? నిజమా? కరోనాకు మందు ఈ చికెన్ బిర్యానీ నేనా, ఇది మరో లెవెల్ మార్కెటింగ్ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ లో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రూ.5 ల నోటు పై ఈ బొమ్మ ఉంటే లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు.. కానీ!

ఈ ప్రపంచం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ ఎంతో ముందుకు పోతుంది. కానీ ఈ అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ఇప్పటికీ ఎంతోమంది వెనుకబడే ఉన్నారు. ఇప్పటికీ కొందరి మాటలను ఎంతో అమాయకంగా నమ్ముతూ నిలువునా మోసపోయి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఇటువంటి సంఘటనలను గురించి మనం ఎన్నో విన్నాం. తాజాగా ఇటువంటి సంఘటనే కామారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కస్తూరి నర్సింహులు అనే వ్యక్తికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. పాత రూ.5 నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉంటే మీకు రూ.11.74 వస్తాయని ఎంతో నమ్మకంగా చెప్పాడు.అతని మాటలను నమ్మిన నరసింహులు ఎలాగైనా డబ్బులను సొంతం చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే అవతలి వ్యక్తి చెప్పిన విధంగానే నర్సింహులు రూ.8.35 లక్షల రూపాయలను జమ చేశాడు.

ఆ పదకొండు లక్షల రూపాయలను పొందడం కోసం ఖాతా తెరవాలని, మరోసారి కాల్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం డబ్బులు అవసరం అవుతాయని, మరోసారి ఐటీ క్లియరెన్స్ కోసం అంటూ సుమారు పది సార్లు నరసింహులకి ఫోన్ చేసి సుమారు 8 లక్షల రూపాయల వరకు నిలువు దోపిడీ చేశారు.ఈ విధంగా అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసిన అవతలి వ్యక్తి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో అనుమానం కలిగింది.

ఈ క్రమంలోనే నరసింహులు తను మోసపోయానని గ్రహించి దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా అతనికి ఫోన్ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ నెంబర్ ఆధారంగానే పోలీసులు ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే ఇటువంటి మోసపూరిత ఫోన్ కాల్స్ గురించి పోలీసులు ఇప్పటికే ప్రజలలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ప్రజలు తరచూ ఈ విధంగా మోసపోతూనే ఉన్నారు.ఇప్పటి నుంచైనా ఇటువంటి నేరగాళ్ల పట్ల జాగ్రత్తలు వహించాలని పోలీసులు మరోసారి తెలియజేసారు.