Tag Archives: karnataka tourism

ఆ ఊరు మొత్తం బొమ్మలే.. కానీ బొమ్మలని ఎవరూ నమ్మలేరు?

పల్లెల్లో జీవన విధానం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ పట్టణాలలో నివసించే వారు ఇలాంటి జీవితాన్ని అనుభవించలేరు. ఎక్కడ చూసిన రద్దీగా జనాలు, ఆకాశాన్ని తాకే మేడలు తప్ప పట్నం వాసులకు మరేమీ కన్పించవు. ఈ క్రమంలోనే పట్నం వాసులను కొంతమేర ఆనంద పరచడానికి హైదరాబాద్లో శిల్పారామంలో పల్లె వాతావరణానికి సంబంధించిన సెట్ వేసి పట్నం వాసులకు కొంతమేర ఆనందాన్ని కలిగిస్తున్నారు. అచ్చం శిల్పారామం మాదిరిగానే అంతకన్నా పెద్ద విలేజ్ సెట్టింగ్ మనం కర్ణాటక వెళ్తే చూడవచ్చు.

కర్ణాటక రాష్ట్రానికి మీరు పర్యాటక ప్రాంతాలను చూడటానికి వెళితే ఈ రాష్ట్రంలో హవెరి జిల్లా… గొటగొడికి వెళ్లండి.అక్కడి ఉత్సవ్ రాక్ గార్డెన్‌ను మాత్రం ఎలాంటి పరిస్థితులలో చూడకుండా వెనుక తిరగకండి. ఆ తరువాత ఇంత అందమైన ప్రదేశాన్ని ఎలా మిస్ అయ్యామని బాధపడక మానరు. ఈ గ్రామంలో అంత ప్రత్యేకత ఉంది. మరి ఆ గ్రామంలో ఉన్న ఆ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉత్సవ్ రాక్ గార్డెన్ లోకి మనం వెళ్లి చూస్తే… అక్కడ అన్ని బొమ్మలు ఉంటాయి. కానీ అవి బొమ్మలు అని మాత్రం అనిపించవు అంత అందంగా సహజసిద్ధంగా అచ్చం మనుషుల మాదిరే పోలిఉన్న ఆ బొమ్మలను చూస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.అచ్చం పల్లె వాతావరణాన్ని తలపించే విధంగా ఈ గార్డెన్లో బొమ్మలను ఏర్పాటు చేసి ఉన్నారు

ఈ గార్డెన్ లో బొమ్మలతోనే కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్లు, పశువుల సంత, ఇలా ఏది చూసి నా మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించే విధంగా ఈ గార్డెన్ ఉంటుంది.ప్రస్తుతం పట్టణంలో పెరిగే పిల్లలకు పల్లె వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు కనుక అలాంటి వారి కోసమే కళాకారుడైన డాక్టర్‌ టి.బి సొలబక్కనవర్‌ ఈ ఉత్సవ్ గార్డెన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్డెన్ లో సుమారు అన్ని రకాల వృత్తులకు చెందిన కళాకారులకు సంబంధించి సుమారు వెయ్యి బొమ్మల వరకు కొలువై ఉన్నాయి. మరెందుకాలస్యం ఈసారి కర్ణాటక టూర్ ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ గార్డెన్ చూడకుండా మాత్రం రాకండి.