Tag Archives: Kerala Police

మానస హత్య కేసులో మరో మలుపు.. హత్యలో వేరొకరి ప్రమేయం..?

కేరళలోని కన్నూరు దగ్గర నెల్లికుళ్లిలో ఉన్న ఇందిరా గాంధీ డెంటల్ కాలేజీలో మానస అనే మహిళ హౌస్ సర్జన్‌గా పనిచేస్తోంది. 2 ఏళ్ల కిందట ఆమెకు రాఖిల్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వారా కలిశాడు. వారి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. అతడు ఆమెకు ప్రపోస్ చేశాడు కానీ ఆమె మాత్రం ఒప్పుకోలేదు. ఆ తర్వాత నుంచి అతని ప్రవర్తన మారింది. నువ్వు ఏ అబ్బాయిలతోనూ మాట్లాడొద్దు, ఎక్కువ సేపు మొబైల్ వాడొద్దు, చాటింగ్ చెయ్యొద్దు అంటూ ఆధిపత్యం చూపించడం ప్రారంభించాడు. దీంతో మాసన అతన్ని దూరం పెట్టడం ప్రారంభించింది. వేధింపుల ఎక్కువ అవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

ఇక నుంచి ఎలాంటి డిస్టబ్ చేయనంటూ చెప్పి వెళ్లడు. కానీ ఆమెపై మాత్రం పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. దీంతో గత వారం ఆమె ఇంట్లోకి వెళ్లి కాల్చి చంపేశాడు. తదనంతరం అతడు కూడా కాల్చకొని చనిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరొకరి ప్రమేయమున్నట్లుగా తేల్చారు పోలీసులు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాఖిల్ కు తుపాకీ ఎక్కడ నుంచి వచ్చిందన్న అంశంపై ఎక్కువగా వివరాలను రాబడుతున్నారు. బీహార్‌లోని మంగేర్‌ జిల్లా ఖప్రతారా ఏరియాకు చెందిన 21ఏళ్ల సోను కుమార్ తన దగ్గర ఉన్న తుపాకీ ని రాఖిల్‌కి ఇచ్చినట్లు గుర్తించారు. కేరళకు చెందిన పోలీసులు బీహార్ పోలీసుల సహకారంతో అతడిని అరెస్టు చేశారు. సోను కుమార్ ను మంగేర్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. రాఖిల్ ఒక ఉబెర్‌ టాక్సీ డ్రైవర్‌ సాయంతో కేరళ నుంచి బిహార్ వెళ్లినట్లు తేల్చారు.

అక్కడ సోను దగ్గర నాటు తుపాకీ కొని కేరళలోని కొత్తమంగళంకు వచ్చి మానసకు దగ్గర్లోనే ఓ రూం అద్దెకు తీసుకున్నాడు. అక్కడ నుంచే మానసను ఎలా చంపాలనే ప్లాన్ వేశాడు. దీంతో పట్టపగలే ఆమె ఉంటున్న ఇంట్లోకి వెళ్లి మానసను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ఇక ఉబెర్ డ్రైవర్ ఎక్కడ ఉన్నడనే దానిపై ఆరా తీస్తున్నారు.