Tag Archives: major woman

నా పెళ్లంతో నేను ఉంటా.. 16 ఏళ్ళ బాలుడి మొండిపట్టు?

కొన్నిసార్లు బాధితుల కోర్టులో పలు కేసులను విచారించి ఎలాంటి తీర్పు ఇవ్వాలి అనే విషయం న్యాయమూర్తులకి కూడా ఒక సవాలుగా ఉంటుంది. అలాంటి విచిత్రమైన ఎన్నో కేసులను వారు ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో అలహాబాద్‌ హైకోర్టుకు అలాంటి ఒక వింత కేసు వచ్చింది. ఇంతకీ న్యాయమూర్తులకే సవాల్ గా మారిన ఆ కేసు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

అలహాబాద్ కోర్టులో ఒక 16 ఏళ్ల కుర్రాడు తన తల్లి రక్షణలోనే ఉండాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం అతడికి పదహారేళ్ళ వయసు ఉన్నప్పటికీ అతనికి వివాహం జరిగింది. ఈ క్రమంలోనే ఆ బాలుడిని మైనర్ గా పరిగణించి తన తల్లి వద్ద ఉండాలని కోర్టు తీర్పు చెప్పింది. కాని కోర్టు ఇచ్చిన తీర్పును తిరస్కరించిన బాలుడు తనకు తన పెళ్ళామే కావాలని మొండిపట్టు పట్టాడు.

ఒకవేళ బాలుడు కోరిక ప్రకారమే తన పెళ్ళాం దగ్గరకు పంపించాలంటే ఒక మైనర్ బాలుడు మేజర్ యువతితో సహజీవనం చేస్తే అది పోక్సో చట్టం ప్రకారం నేరం, కనుక ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపుతూ కోర్టు బాలుడికి మైనారిటీ తీరే వరకు అనగా 2022 ఫిబ్రవరి 4వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని షెల్టర్‌ హోంకు తరలించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

ప్రస్తుతం మైనర్ గా ఉన్న బాలుడికి మైనారిటీ తీరిన తరువాత అతడి ఇష్టప్రకారం తను ఎక్కడ ఉండదు తెలుసుకోవాలనుకుంటే అక్కడ ఉండవచ్చని బాలుడి తల్లి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్‌ జేజే మునీర్‌ విచారణ జరిపి ఈ విధమైనటువంటి తీర్పును వెల్లడించారు. ఈ విచిత్రమైన కేసులో మరొక అద్భుతమైన ట్విస్ట్ ఏమిటంటే మైనర్ బాలుడు, మేజర్ యువతితో ఉన్న సాన్నిహిత్యం వల్ల వీరికి ఒక బాబు కూడా ఉండటం గమనార్హం.