Tag Archives: marks

Tenth Class: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్ష రాసే పేపర్లలో మార్పులు..!

Tenth Class: పదో తరగతి విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ విద్యాశాఖ. ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షల్లో కేవలం ఆరు పేపర్లు మాత్రము ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

Tenth Class: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్ష రాసే పేపర్లలో మార్పులు..!

పదో తరగతి విద్యార్థులకు గతంలో పేపర్ 1, పేపర్ 2గా మొత్తం 11 ప్రశ్నా పత్రాలు ఉండేవి. అయితే కోవిడ్ ప్రభావంతో ఈసారి ఆరు పేపర్లకే కుదించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Tenth Class: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్ష రాసే పేపర్లలో మార్పులు..!

ఈసారి కూడా చాలా ఆలస్యంగానే విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. ఇదే కాకుండా థర్డ్ వేవ్ కారణంగా ఇటీవల కొన్ని రోజులు స్కూళ్లు మూతపడ్డాయి.  ఇదిలా ఉంటే ఈసారి ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్లను సింగిల్ పేపర్లకే పరిమితం చేస్తున్నామని పరీక్షల విభాగం డైరెక్టర్ వెల్లడించారు.

ఎలాంటి తప్పిదాలు ఉండకూడదని ఆదేశాలు..

ఫస్ట్ లాంగ్వేజ్ తో పాటు మిగతా సబ్జెక్ట్ ల పేపర్లను సింగిల్ పేపర్లకు పరిమితం చేశారు. మొత్తం వంద మార్కులకు జరిగే ఈ పరీక్షల్లో 80 మార్కులు బోర్డ్ ఎగ్జామ్స్ కాగా…20 మార్కులు ఇంటర్నల్స్ మార్కులు ఉంటాయని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో రెగ్యులర్, ఓపెన్ టెన్త్, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను తప్పులు లేకుండా తీసుకోవాలని, ఆన్ లైన్ డాటా సేకరణలో ఎలాంటి తప్పిదాలు ఉండకూడదని ఆదేశాలు జారీచేశారు. కాగా.. గతంలో కొన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గడువు తేదీలు ముగిసినా కూడా రెండు, మూడు నెలలకు మన్యూ స్ట్రిప్ట్ నామినల్ రోల్స్(ఎంఎన్ఆర్) ను సమర్పిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని… ఈసారి ఆలస్యం జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఈసారి ఆలస్యం అయితే.. ఆలస్య రుసుము తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల వారీగా విద్యాశాఖాధికారులు కార్యాయాలయాల్లో చలానాతో పాటు ఎంఎన్ఆర్ లను గడువులోగా సమర్పించాలని.. అందకపోతే తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.