Tag Archives: mobile connection

సిమ్ కార్డ్ కొత్త నిబంధనలు.. ఇకపై సులభంగా పొందే ఛాన్స్..?

సాధారణంగా సిమ్ కార్డును కొనుగోలు చేయాలంటే ఉండే ఇబ్బందులు అన్నీఇన్నీ కావనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఒరిజినల్ ఆధార్ కార్డుతో వెరిఫికేషన్ కు హాజరైతే మాత్రమే సిమ్ కార్డును జారీ చేస్తున్నారు. అయితే కేంద్రం కొత్త నిబంధనలను తీసుకొనిరావడానికి సిద్ధమవుతోంది. ఈ నిబంధనల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది.

ఎవరైనా ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మారాలంటే సులభంగా మారిపోవచ్చు. ఎటువంటి వెరిఫికేషన్ అవసరం లేకుండా వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి సులభంగా సిమ్ కార్డును ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మార్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించడానికి సిద్ధమవుతోంది. త్వరలో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు అమలు కానున్నాయని ఈ నిబంధన అమలులోకి వస్తే కొత్తగా అప్లికేషన్ ఫామ్ ను సమర్పించాల్సిన అవసరం సైతం ఉండదని కేంద్రం చెబుతోంది.

ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మారిన వినియోగదారులు కంపెనీ వెబ్‌సైట్ లో చిరునామాకు సంబంధించిన ప్రూఫ్ ను సబ్మిట్ చేస్తే ఆ అడ్రస్ కు కంపెనీ బిల్ పంపుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కొత్త నిర్ణయాలను అమలులోకి తెస్తోంది. దేశంలో పోస్ట్ పెయిడ్ కస్టమర్లతో పోలిస్తే ప్రీ పెయిడ్ కస్టమర్ల సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది.

ఎవరైనా ప్రీ పెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్ కు మారాలంటే మళ్లీ వెరిఫికేషన్ ను పూర్తి చేయాల్సి ఉన్న నేపథ్యంలో చాలామంది పోస్ట్ పెయిడ్ లోకి మారడానికి ఆసక్తి చూపుతున్నారు. టెలికం డిపార్ట్‌మెంట్ నూతన విధానం ద్వారా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది.