Tag Archives: phones call

Booster Dose: ఒక్క ఫోన్ కాల్ తో..! ఇంటికి వ్యాక్సిన్.. !

Booster Dose: కరోనా కాలంలో ఎంతమంది ఇబ్బంది పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇలా గత రెండు సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. అయితే దీనికి శాశ్వత పరిష్కారం అయితే కనుక్కోలేదు కానీ.. వ్యాక్సిన్లు మాత్రం తీసుకొచ్చారు.

Booster Dose: ఒక్క ఫోన్ కాల్ తో..! ఇంటికి వ్యాక్సిన్.. !

మన దేశంలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ వంటి వ్యాక్సిన్లు తీసుకొచ్చారు. అయితే మొదట రెండు డోసుల వరకు చాలు అని చెప్పిన అధికారులు బూస్టర్ డోసు కూడా వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం బూస్టర్ డోసులను కూడా ఉచితంగానే అందిస్తోంది.

Booster Dose: ఒక్క ఫోన్ కాల్ తో..! ఇంటికి వ్యాక్సిన్.. !

అయితే రెండో డోసు వేసుకొని 9 నెలల తర్వాత మాత్రమే బూస్టర్ డోసు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే దీనిని 9 నెలలు కాకుండా.. 6 నెలలకు తగ్గించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. ఇక బూస్టర్ డోస్ తీసుకోవాలని అనుకునే వారికి జీహెచ్ఎంసీ తాజాగా ప్రకటన వెలువరించింది. ఒక్క ఫోన్‌ కాల్‌ చేయండి.. మీ ఇంటికి వచ్చి బూస్టర్‌ డోస్‌ వేస్తాం అనే నినాదంతో ముందకు వచ్చింది. ప్రస్తుతం 60 ఏళ్ల దాటిన వాళ్లకు, అనారోగ్య సమస్యలు ఉన్న వారు జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 040-2111 1111 కు ఫోన్‌ చేస్తే ఇళ్ల వద్దకే వచ్చి సిబ్బంది బూస్టర్‌ డోస్‌ ఇస్తారని అధికారులు పేర్కొన్నారు.


ప్రతీ ఒక్కరు ఈ అవకాశాన్ని ..

థర్డ్ వేవ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటి వరకు బూస్టర్‌ డోస్‌ తీసుకోని వారు ఆ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే.. మొబైల్‌ వాహనంలో ఇంటికి వచ్చి వ్యాక్సిన్‌ ఇస్తారు. ప్రతీ ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.