Tag Archives: pm care

కరోనాతో అనాథగా మారిన చిన్నారులకు రూ.10 లక్షలు డిపాజిట్ : కేంద్ర ప్రభుత్వం

గత ఏడాదిన్నర కాలం నుంచి కరోనా మహమ్మారి దేశం పై కొరడా జులిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో ఎంతోమంది బతుకులు వీధిన పడ్డాయి. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు, చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తను కోల్పోయిన భార్య ఎంతో మంది వివిధ రకాల కష్టాలను అనుభవిస్తున్నారు.

ఇటువంటి సమయంలోనే కరోనా మహమ్మారికి బలై తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. ఈ క్రమంలోనే “పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్” అనే పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా అనాధలైన చిన్నారుల పేరిట నగదు డిపాజిట్ చేసి వారిని సైనిక, కేంద్రీయ విశ్వవిద్యాలయం, నవోదయ పాఠశాలలో చదువులు చదివిస్తూ వారి పుస్తకాలకు, బట్టలకు అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది.

ఈ చిన్నారులకు 18 సంవత్సరాలు నిండిగానే వారికినెల నెలా స్టయిపెండ్ అందిస్తారు. డిపాజిట్ చేసిన నగదును 23 ఏళ్లు నిండిన తర్వాత రూ. 10 లక్షలు ఇస్తారు. అదేవిధంగా ఉన్నత చదువుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వాటికి వడ్డీని పీఎం కేర్స్ నుంచి చెల్లిస్తారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆయుష్మాత్ భారత్ స్కీమ్ కింద రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య బీమాను కల్పించనున్నారు.

కరోనా కారణంగా తల్లిదండ్రులు సంరక్షకులను కోల్పోయిన చిన్నారులు గత నెల ఏప్రిల్ 1 నుంచి మే 25 వరకు అన్ని రాష్ట్రాలలోనూ, కేంద్రపాలిత ప్రాంతాల లోనూ ఇప్పటి వరకు 557 మంది చిన్నారులను పలు నివేదికల ఆధారంగా గుర్తించినట్లు కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.దేశవ్యాప్తంగా అనాథలైన చిన్నారుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విధమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి నందుకు మంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.