Tag Archives: power supply cut

AP News: ఏపీ ప్రభుత్వానికి షాక్..! విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఎన్టీపీసీ..!

AP News: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక లోటులో ఉన్న ఏపీకి వరసగా షాక్ లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పీఆర్సీ అంశంపై ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది. నిన్న విజయవాడలో ఉద్యోగుల ధర్నా విజయవంతం అయింది.

AP News: ఏపీ ప్రభుత్వానికి షాక్..! విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఎన్టీపీసీ..!

ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఉద్యోగులను ప్రభుత్వం కోరుతోంది.
ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వానికి నేషనల్ పవర్ థర్మర్ కార్పోరేషన్(ఎన్టీపీసీ) షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఎన్టీపీసీ ప్రతిచర్యకు దిగింది.

AP News: ఏపీ ప్రభుత్వానికి షాక్..! విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఎన్టీపీసీ..!

రాష్ట్రానికి సరఫరా చేస్తున్న 2 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాని ఒక్కసారిగా ఆపేసింది. దీంతో తేరుకున్న అధికారులు ఈ లోటును భర్తీ చేయడానికి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్( ఆర్టీపీపీ) ద్వారా విద్యుత్ డిమాండ్ పడిపోకుండా చేయాలని భావించారు.

విద్యుత్ సరఫరా చేయలేక ..

ఆర్టీపీపీలో మరో యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే… ఆర్టీపీపీ వద్ద విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు లేవని సమాధానం రావడంతో ఏపీ ప్రభుత్వానికి పాలుపోని స్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే కృష్ణపట్నం యూనిట్లో సాంకేతిక సమస్య కారణంగా 810 మెగాయూనిట్లు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. అయితే అక్కడ కూడా 5 రోజులకు సరిపడే బొగ్గ నిల్వలు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయలేక ఏపీ వ్యాప్తంగా కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.