Tag Archives: Preparations

Telangana Jobs: తెలంగాణలో 60 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు..! మొదలైన కొలువుల జాతర!

Telangana Jobs: తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఖాళీల జాబితా కేబినేట్ ముందుకు రానుంది. అన్ని కుదిరితే ఈ నెలాఖరులోగా నిరుద్యోగులకు తీపి కబురు అందనుంది. ఉద్యోగాల భర్తీపై రాష్ర్టంలోని నిరుద్యోగులు దాదాపుగా నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు వారి ప్రిపరేషన్ కూడా ప్రారంభించారు.

Telangana Jobs: తెలంగాణలో 60 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు..! మొదలైన కొలువుల జాతర!

సుమారు 60వేల ఖాళీలను గుర్తించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం నిధులు, నీళ్లు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడింది. నిధులు, నీటిపారుదల ప్రాజెక్టుల సంగతి ఎలా ఉన్నా.. నియామకాల విషయంలో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటి వరకు గ్రూప్-1, 3 నోటిఫికేషన్లే రాలేదు. మరోవైపు గ్రూపు-2 పోస్టులను ఒక్కసారే భర్తీ చేసింది.

Telangana Jobs: తెలంగాణలో 60 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు..! మొదలైన కొలువుల జాతర!

రమారమీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 1.30లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. వీటిల్లో ఎక్కువగా పోలీస్, విద్యుత్తు, టీఎస్పీఎస్పీ, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల్లోనే ఖాళీలను భర్తీచేసింది. ఉపాధ్యాయుల ఖాళీలకు సంబంధించి టీఆర్టీ నోటిఫికేషన్ సుమారు 9వేల పోస్టులతో 2016లో వచ్చింది. నాటినుంచి ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయలేదు. దీనికోసం పెద్ద సంఖ్యలో బీఈడీ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

ఇది భవిష్యత్తులో తెరాస ప్రభుత్వానికి రాజకీయంగా..

దీనికి సంబంధించి టెట్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం సర్కారు జారీ చేయనున్న ఉద్యోగ ప్రకటనల్లో ఎక్కువ సంఖ్యలో పోలీస్, విద్యా, ఆరోగ్య రంగాలకు చెందిన శాఖల్లోనే ఎక్కువ భర్తీ చేసే అవకాశముంది. ఇప్పటికి భర్తీ చేసిన ఖాళీల్లో పోలీసు ఉద్యోగాలే అధికంగా ఉండటం విశేషం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నియామకాలపై సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇది కేసీఆర్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దుబ్బాక ఉపఎన్నిక నుంచి ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికల సమయాల్లో తెరాస అగ్రనాయకత్వం ఉద్యోగ ఖాళీల భర్తీపై హామీలు ఇస్తూ వచ్చింది. అయినా నేటికీ నియామక ప్రకటన రాలేదు. ఇది నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. ఇది భవిష్యత్తులో తెరాస ప్రభుత్వానికి రాజకీయంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా, మల్టీ, బహుళ జోన్లు ఖరారు చేస్తూ రాష్ర్టపతి ఉత్తర్వులు వచ్చాయి. ఆయా జోన్లకు సంబంధించిన ఖాళీల వివరాలు సీఎంవో కార్యదర్శి శేషాద్రి వద్ద ఉంది. దీనికి ఆయన కేబినేట్ కు సమర్పించనున్నారు. ఈ పరిణామాలన్నీ సజావుగా జరిగితే ఈ నెలాఖరులో నిరుద్యోగులకు శుభవార్త అందనుంది.