Tag Archives: project associate jobs

రాతపరీక్ష లేకుండా ఏఎండీ కాంప్లెక్స్ లో ఉద్యోగాలు.. రూ.31 వేల వేతనంతో..?

అటామిక్ మిన‌రల్స్ డైరెక్ట‌రేట్ ఫ‌ర్ ఎక్స్‌ప్లొరేష‌న్ అండ్ రిసెర్చ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భార‌త ప్ర‌భుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. మొత్తం 31 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా జనవరి 23వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ మెయిల్ ద్వారా మాత్రమే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

షార్ట్ లిస్టింగ్, ఆన్ లైన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ చేపడతారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యార్హత, అనుభవం, ఇతర వివరాలను బట్టి అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 35 ఖాళీలలో ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ (ఫిజిక్స్‌) ఉద్యోగాలు 8, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) ఉద్యోగాలు 10, ప్రాజెక్ట్ అసోసియేట్‌-1 (జియాల‌జీ) ఉద్యోగాలు 17 ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు rectt2019.amd@gov.in ఈ మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు సాఫ్ట్ కాపీతో పాటు ఇతర ధృవీకరణ పత్రాలను పంపాల్సి ఉంటుంది. ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 2021 సంవత్సరం జనవరి 23వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్‌-1 ఉద్యోగాలకు మాత్రం 27 సంవత్సరాలోపు వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

https://amd.gov.in/// వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 31,000 రూపాయలు వేతనంగా పొందే అవకాశం ఉంటుంది. ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 20,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి హెచ్ఆర్ఏ అదనంగా పొందే అవకాశం ఉంటుంది.