Tag Archives: property benefits

భార్య పేరుపై ఇంటిని కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలు మీ కోసమే..

ఇంటిని కొనుగోలు చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దానిని సొంత స్థలం ఉంటే దగ్గరుండి నిర్మిస్థారు. లేదంటే కట్టిన ఇంటిని కొనుగోలు చేస్తారు. అయితే ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మహిళల పేరు మీదనే చేసేందుకు చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే, మహిళల పేరుతో ఇల్లు కొనడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

వీటి ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, పన్ను మినహాయింపులు చాలావరకు ఉంటాయి. ఇన్ కమ్ ట్యాక్స్ లో మహిళలకు ఎక్కువ పన్ను రాయితీలు ఇస్తుంటారు. ఈ విషయం తెలిసిన చాలామంది మహిళల పేరు మీదనే ఇంటిని రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఇంకా ఇంటి రుణం తీసుకునే క్రమంలో కూడా మహిళా కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు గృహ రుణాలపై 0.5 శాతం తక్కువ వడ్డీ రేటును అందిస్తోంది.

అంతే కాకుండా స్టాంప్ డ్యూటీలో కూడా మినహాయింపులను మహిళలకు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన రాష్ట్ర స్థాయిలో విస్తృత రాయితీలను అందిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గృహ రుణాలు తీసుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 శాతం వడ్డీ తగ్గించింది. అయితే, ఎస్‌బిఐ యోనో యాప్ ద్వారా హౌస్ లోన్ అప్లై చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది.

ఇక ఎస్బీఐ హోమ్ లోన్ విషయానికి వస్తే వడ్డీ రేటు 6.70 శాతం గా ఉంది. రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు ఉండే గృహ రుణాలపై వడ్డీ రేటును 6.95 శాతంగా ఉంది. రూ. 75 లక్షలుపైన రుణం తీసుకున్న వాళ్లకు ఏడు శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటును ఇస్తున్నారు.