Tag Archives: Rajiv colony

వామ్మో..ఉల్లి పకోడీలో కప్ప..!

ఈ చల్ల చల్లని వాతావరణంలో ఎవరికైనా వేడివేడిగా బజ్జీలు లేదా పకోడీలు తినాలని అనిపిస్తుంది. అలా తింటూ ఉంటే ఆ మజానే వేరేగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగానే ఆలోచించి ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరులో జిల్లాలోని కుప్పంలో వ్యక్తి వేడి వేడి ఉల్లిపాయ పకోడీలను తినాలనుకున్నాడు. అనుకున్న వెంటనే సోమవారం (జనవరి 4) సాయంత్రం సమీప రాజీవ్ కాలనీ లో బజ్జీలు, పకోడీల దుకాణానికి వెళ్లి ఉల్లిపాయ పకోడీలు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. 

ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ప్యాకెట్ ఓపెన్ చేసి పకోడీలు తిందామని అనుకుంటుండగా ఒక్కసారిగా ఆ వ్యక్తి ఉలిక్కిపడ్డాడు. పకోడీలు అతని చేతికి మెత్తగా అనిపించడంతో ఏంటని దానిని దీర్ఘంగా చూశాడు. అయితే అది మాత్రం పకోడీ కాదు ఒక “కప్ప” అని తెలుసుకున్నాడు.ఆ పకోడీలలో కప్ప ఉందని తెలియగానే ఎంతో షాక్ అయిన ఆ వ్యక్తి కోపంతో తిరిగి దుకాణదారుడు దగ్గరికి వెళ్లాడు.

దుకాణం వద్ద చేరుకొని పకోడీలు ఆమె వ్యక్తిపై దుకాణంలో పకోడీ లతోపాటు కప్పలను కూడా వేసి అమ్ముతున్నావా? అంటూ ఆ వ్యక్తిని నిలదీశాడు. అందుకు అతను స్పందించి బాబు.. తప్పైపోయింది పొరపాటుగా ఇలా జరిగింది. క్షమించండి అంటూ… ప్రాధేయపడ్డాడు. ఇంకోసారి ఈ విధంగా జరగకుండా జాగ్రత్త పడతానని దుకాణదారుడు తెలియజేశాడు. ఇంటికి తీసుకెళ్లిన పకోడీలు తిందామని చూసేసరికి అందులో కప్ప కనిపించింది. అప్పటికే మా ఇంట్లో కొందరు ఈ పకోడీలను తిన్నారని అయితే దేవుడి దయవల్ల ఎవరికి ఎలాంటి హానీ జరగలేదు.పొరపాటున ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఉంటే పరిస్థితి ఏంటని సదరు వ్యక్తి వాపోయాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.