Tag Archives: recurring deposits

ఎస్బీఐ, పోస్టాఫీస్.. ఎందులో డిపాజిట్ చేస్తే ఎక్కువ లాభం..?

దేశంలోని ఉద్యోగులు, వ్యాపారులలో చాలామంది పిల్లల చదువు, ఇతర అవసరాల దృష్ట్యా డబ్బులను పొదుపు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ వడ్డీ వచ్చినా ఎస్బీఐ, పోస్టాఫీస్ స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎస్బీఐ, పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లలో ఏది బెస్ట్ అనే ప్రశ్నకు ఎస్బీఐ స్కీమ్ లు కొంతమందికి బెస్ట్ అనిపిస్తుంటే మరి కొంతమందికి పోస్టాఫీస్ స్కీమ్ లే బెస్ట్ అనిపిస్తున్నాయి.

టర్మ్ డిపాజిట్ల మాదిరిగా ఉండే రికరింగ్ డిపాజిట్లలో నెలకు కొంత మొత్తం చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లను పరిశీలిస్తే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేసిన వారికి 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి 90 రోజులకు ఒకసారి వడ్డీ పోస్టాఫీస్ ఖాతాలో జమవుతుంది. అయితే ఎస్బీఐలో రికరింగ్ డిపాజిట్లకు 5.4 శాతం వరకు వడ్డీ లభిస్తుండగా సీనియర్ సిటిజన్లు 50 బేసిక్ పాయింట్ల ఎక్కువ వడ్డీని పొందే అవకాశం ఉంటుంది.

పోస్టాఫీస్ లో రికరింగ్ డిపాజిట్ ఖాతాలో డబ్బులు జమ చేయాలంటే నగదు ద్వారా మాత్రమే లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రం నగదుతో పాటు చెక్ ద్వారా కూడా డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. పోస్టాఫీఫ్ లో రికరింగ్ డిపాజిట్ ఖాతాలకు మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలుగా ఉండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు నుంచి పది సంవత్సరాల కాలం ఉంటుంది.

పోస్టాఫీస్ లో 10 రూపాయలతో రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరిచే అవకాశం ఉంటే ఎస్బీఐలో 100 రూపాయలతో రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది. ఎస్బీఐలో ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికను బట్టి వడ్డీ రేట్లు మారితే పోస్టాఫీస్ లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల ప్రకారం వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. ఎస్బీఐ, పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లలో ఆదాయం, ఎంచుకునే కాలపరిమితి ఆధారంగా ప్రయోజనాలలో మార్పులు ఉంటాయి.