Tag Archives: Restraurant

రెస్టారెంట్ లో అయిన బిల్లు కంటే నాలుగు రెట్లు అధికంగా చెల్లించిన కస్టమర్.. చివరికి?

సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేసి వస్తే బిల్లుతో పాటు ఏ పదో పాతికో టిప్ ఇచ్చి వస్తాము. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా రెస్టారెంట్లు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ క్రమంలోనే రెస్టారెంట్ లో పనిచేసే సిబ్బంది ఉపాధిని కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ఆంక్షలకు సడలింపు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే రెస్టారెంట్ తెరుచుకున్నాయి.

రెస్టారెంట్ తెచ్చుకున్నప్పటికీ ప్రజలందరూ ఇంటి భోజనానికి అలవాటుపడ్డారు. ఈ క్రమంలోనే రెస్టారెంట్ కి వెళ్లే వారి సంఖ్య అరకొరగానే ఉంది. ఇలాంటి సమయంలోనే సిబ్బందికి జీతాలు కూడా అలాగే ఇస్తున్నారు. ఇటువంటి కష్ట కాలంలో సర్వర్లకు ఒక యాభై రూపాయలు టిప్ ఇస్తే వారి మొహంలో చెప్పలేనంత ఆనందం కనిపిస్తుంది. అలాంటిది ఏకంగా
16000వేల డాలర్లు టిప్ గా వస్తే.. ఎలా ఫీల్‌ అయివుంటారో మీరే ఆర్ధం చేసుకోవాలి.

అమెరికాలోని ఓ రెస్టారెంట్లో కస్టమర్ చేసిన బిల్లు 40 డాలర్ల కన్నా తక్కువే. కానీ ఆ కస్టమర్ మాత్రం టిప్పుగా చెల్లించింది మాత్రం 16000వేల డాలర్లు. ఇంత పెద్ద మొత్తంలో టిప్ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేశారు. బిల్లుతో పాటు క్రెడిట్ కార్డు తీసుకున్న సిబ్బంది అది చూసి ఒక్క సారిగా షాక్ అయింది.

ఈ క్రమంలోనే కస్టమర్ పొరపాటున ఇలా చేసి ఉంటారని అతని దగ్గరకు వెళ్లగానే అతను రెస్టారెంట్ లో పనిచేసే సిబ్బందికి టిప్ ఇచ్చినట్లు తెలపడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విధంగా కస్టమర్ ఇచ్చిన టిప్ ఆ సమయంలో పనిచేసే సిబ్బంది మాత్రమే కాకుండా రెస్టారెంట్లో పనిచేసే సిబ్బంది మొత్తం సమానంగా పంచుకొని అతనికి కృతజ్ఞతలు తెలిపారు.